Railways News Alert: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. తిరుపతికి మరిన్ని ప్రత్యేక రైళ్లు.. వివరాలు చెక్ చేసుకోండి
Railway Passenger Alert: ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడుపుతున్న రైల్వే శాఖ(Indian Railways).. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మరో నాలుగు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది.
Special Trains: ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రముఖ నగరాల మధ్య రైల్వే శాఖ ఇప్పటికే పలు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. తాజాగా తిరుపతికి దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) మరో నాలుగు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. నాందేడ్ – తిరుపతి మధ్య ఈ ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. నాందేడ్ – తిరుపతి వీక్లీ స్పెషల్ ట్రైన్ (నెం.07641) ఆగస్టు 1, 8 తేదీల్లో (సోమవారం) రాత్రి 10.45 గం.లకు నాందేడ్ నుంచి బయలుదేరి మరుసటి రోజ రాత్రి 10.10 గం.లకు తిరుపతి రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది. అలాగే తిరుపతి – నాందేడ్ వీక్లీ స్పెషల్ ట్రైన్ (నెం.07642) ఆగస్టు 2, 9 తేదీల్లో (మంగళవారం) రాత్రి 11.50 గం.లకు తిరుపతి నుంచి బయలుదేరి మరుసటి రోజు రాత్రి 11.45 గం.లకు నాందేడ్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది.
ఈ ప్రత్యేక రైల్లు పూర్ణ, పర్భణి, గంగఖేర్, పర్లి వైద్యనాథ్, లాతూర్ రోడ్, ఉదయ్‌గిర్, బాల్కీ, భీదర్, జహీరాబాద్, వికారాబాద్, లింగంపల్లి, సికింద్రాబాద్, కాచిగూడ, ఉందానగర్, షాద్‌నగర్, మహబూబ్‌నగర్, గద్వాల్, కర్నూల్ సిటీ, డోన్, గుత్తి, తాడిపత్రి, యెర్రగుంట్ల, కడప, రాజంపేట్, రేణిగుంట రైల్వే స్టేషన్లలో ఆగనుంది.
Four Weekly Special Trains between #Nanded – #Tirupati @drmned @drmgtl @drmsecunderabad @drmhyb pic.twitter.com/NXTOgjBWVg
— South Central Railway (@SCRailwayIndia) July 30, 2022
ఈ ప్రత్యేక రైళ్లలో ఏసీ 2 టైర్, ఏసీ 3 టైర్, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉండనున్నాయి.
మరిన్ని ఏపీ వార్తలు చదవండి..