Tirupati: కడుపు ఉబ్బిపోయి.. శ్వాస తీసుకోలేకపోతున్న మహిళ.. టెస్టులు చేసిన డాక్టర్లు షాక్

తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండలం మన్నారు పొలూరు గ్రామానికి చెందిన నాగమ్మ కడుపు ఉబ్బిపోయి, రెండేళ్లుగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు.

Tirupati: కడుపు ఉబ్బిపోయి.. శ్వాస తీసుకోలేకపోతున్న మహిళ.. టెస్టులు చేసిన డాక్టర్లు షాక్
Rare Operation
Follow us

|

Updated on: Jul 29, 2022 | 8:10 PM

Tirupati: హఠాత్తుగా ఆ మహిళ పొట్ట పెరగడం ప్రారంభమైంది. గర్భం కాదని తెలుసు కానీ, అంతకంతకూ పెరుగుతున్న పొట్ట ఆందోళనకు గురి చేసింది. ఆస్పత్రుల చుట్టూ తిరిగేలా చేసింది. ఎన్నో ఆసుపత్రులు తిరిగినా ఫలితం లేకపోవడంతో ఈ నెల 16న రుయా అనుబంధ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో చేరింది. డాక్టర్‌ మాధవి ఠాగూర్‌ ఆధ్వర్యంలోని వైద్య బృందం పరీక్షించి అండాశయంలో కణితి ఉన్నట్లు గుర్తించారు. భారంగా మారిపోతున్న కడుపులో ఉన్న గడ్డను ఆపరేషన్ చేసి తొలగించాలని చెప్పడంతో తిరుపతి ప్రసూతి ఆసుపత్రికి చేరింది బాధితురాలు. ఈ మేరకు తిరుపతి ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో అరుదైన శస్త్ర చికిత్స జరిగింది. 46 ఏళ్ల నాగమ్మ అనే మహిళ కడుపులోని 35 కిలోల గడ్డను తొలగించిన వైద్యులు ఆపరేషన్ సక్సెస్ చేశారు.

మోయలేనంత బరువుఉన్న గడ్డ కడుపులో ఉండటంతో నడవడం కూడా సాధ్యం కాక, గత కొంతకాలంగా ఆసుపత్రుల చుట్టూ తిరిగింది నాగమ్మ. నాగమ్మ స్వస్థలం సూళ్లూరుపేట మండలం మన్నారు కోటూరు గ్రామం. కాగా, 46 ఏళ్ల నాగమ్మను పరీక్షించి క్లిష్టమైన ఆపరేషన్ పూర్తి చేసారు వైద్యులు. జూలై16న ఆసుపత్రిలో అడ్మిట్ అయిన నాగమ్మ కు తిరుపతి ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ లక్ష్మి సుశీల, సీనియర్ గైనకాలజిస్టు డాక్టర్ పార్థసారథి పర్యవేక్షణలో ఆపరేషన్ చేశారు. గంట వ్యవధిలో కడుపులోని 35 కిలోల గడ్డను తొలగించారు. ప్రస్తుతం నాగమ్మ సంపూర్ణ ఆరోగ్యంతో ఉందని చెప్పారు.

తిరుపతి ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి వైద్యులు ఓ మహిళకు శస్త్రచికిత్స చేసి ఆమె కడుపులోంచి 35 కిలోల కణితిని బయటికి తీశారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండలం మన్నారు పొలూరు గ్రామానికి చెందిన నాగమ్మ(46) కడుపు ఉబ్బిపోయి, రెండేళ్లుగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. చాలా ఆసుపత్రులు తిరిగినా ఫలితం లేకపోవడంతో ఈ నెల 16న రుయా అనుబంధ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో చేరారు. డాక్టర్‌ మాధవి ఠాగూర్‌ ఆధ్వర్యంలోని వైద్య బృందం పరీక్షించి అండాశయంలో కణితి ఉన్నట్లు గుర్తించారు. అది పెద్దగా ఉండటంతో శస్త్ర చికిత్స పూర్తి చేసి తీసినట్లు మాధవి ఠాగూర్‌ తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఈ ఫోటోలో పక్షి ఎక్కడుందో గుర్తిస్తే.. మీ ఐ పవర్ కిర్రాకే.!
ఈ ఫోటోలో పక్షి ఎక్కడుందో గుర్తిస్తే.. మీ ఐ పవర్ కిర్రాకే.!
భార్యకు గురక సమస్య ఉంటే! ఓటీటీలోకి డియర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
భార్యకు గురక సమస్య ఉంటే! ఓటీటీలోకి డియర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?
ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
రెండో విడత పోలింగ్ ప్రశాంతం.. మూడో విడత ప్రచారానికి నేతలు సిద్దం
రెండో విడత పోలింగ్ ప్రశాంతం.. మూడో విడత ప్రచారానికి నేతలు సిద్దం
మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం