Monkeypox: పిడుగు లాంటి వార్త.. వేగంగా వ్యాపిస్తున్న మంకీపాక్స్..ఒకే ఇంట్లో నలుగురికి పాజిటివ్!
కోవిడ్‌తో అల్లాడిపోయిన ప్రజల్ని మంకీపాక్స్ కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఇప్పటికే మూడు కేసులు కేరళలో నమోదయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలో రెండు కేసులు..తాజాగా మరో నలుగురికి..
Tamilnadu: దేశంలో మంకీపాక్స్ కలవరం తీవ్రమవుతోంది. ఇప్పటికే కేరళలో మూడు మంకీపాక్స్ కేసులు నమోదు కాగా, దేశవ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖ అలర్ట్ అయ్యింది. ఈ క్రమంలోనే తాజాగా తమిళనాడులో మంకీపాక్స్ కలకలం రేపింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురిరికి మంకీ పాక్స్ లక్షణాలు కనిపించటంతో స్థానికంగా తీవ్ర భయాందోళన మొదలైంది. ఈ నలుగురి నుండి శాంపిల్స్ సేకరించి పుణెకు పంపారు. ఈ నలుగురికి మంకీపాక్స్ సోకిందా లేదా అనే విషయమై నిర్ధారణ కాలేదని తెలిసింది. ఈ క్రమంలోనే కేరళ – తమిళనాడు సరిహద్దు జిల్లాలో అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. కన్యాకుమారి జిల్లాలో కేరళ నుంచి వచ్చిన వారికీ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు అధికారులు. సరిహద్దు జిల్లాలో ప్రత్యేక మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేశారు.
ఇదిలా ఉంటే, రాష్ట్రంలో నాలుగు మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయనే వార్తను తమిళనాడు ఆరోగ్యయ మంత్రి సుబ్రమణ్యన్ ఖండించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ఒక్క మంకీపాక్స్ కేసు కూడా నమోదు కాలేదని స్పష్టం చేశారు. ఒక వేళ కేసులను గుర్తిస్తే ప్రజలను అప్రమత్తం చేయడానికి మేమే మీడియాకు తెలియజేస్తామని వెల్లడించారు. తప్పుడు వార్తలు విని ప్రజలు భయాందోళనలకు గురికావొద్దని సూచించారు.
కోవిడ్‌తో అల్లాడిపోయిన ప్రజల్ని మంకీపాక్స్ కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఇప్పటికే మూడు కేసులు కేరళలో నమోదయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలో రెండు కేసులు నమోదయ్యాయి. మంకీపాక్స్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పలు రాష్ట్రాలకు మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) కూడా పలు దేశాలను మంకీ పాక్స్ పట్ల అప్రమత్తం చేసింది. అంతర్జాతీయ ప్రయాణీకులకు స్క్రీనింగ్ నిర్వహించాలని ఆయా రాష్ట్రాలకు కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసింది. విమానాశ్రయాలు, పోర్టులు, అంతర్జాతీయ సరిహద్దులు ఉన్న ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి