AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: పోలీస్‌ స్టేషన్‌లో జానపద పాటల సందడి.. పాటతో ఖాకీలనే ఆడించిన బుడ్డొడు..

వీడియోలో చూసినట్లుగా, ఒక పోలీసు అధికారి ఎదురుగా ఓ బాలుడు కుర్చీలో కూర్చుని ఉన్నాడు. ఎదురుగా కూర్చుని ఎంతో హుషారుగా పాటపాడుతున్నాడు. ఈ సమయంలో

Viral Video: పోలీస్‌ స్టేషన్‌లో జానపద పాటల సందడి.. పాటతో ఖాకీలనే ఆడించిన బుడ్డొడు..
Boy Sings Folk Song
Jyothi Gadda
|

Updated on: Jul 29, 2022 | 5:01 PM

Share

Viral Video: ఇటీవలి కాలంలో చిన్నారులు పోలీస్‌ స్టేషన్‌ మెట్లెక్కి కంప్లైట్లు చేయటం పలుమార్లు సోషల్ మీడియాలో మనం చూశాం. తాజాగా మరో కుర్రాడు పోలీస్‌స్టేషన్‌లో ఏం చేశాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఓ కుర్రాడు జానపద పాట పాడి ఆ రాష్ట్రవ్యాప్తంగా వార్తల్లో నిలిచాడు. నేరాలను అరికట్టడానికి, నేరస్థులను శిక్షించడానికి పోలీసు స్టేషన్‌లో జానపద పాట పాడాడు. కేరళలోని పాలక్కాడ్‌లోని నటుకల్ పోలీస్ స్టేషన్‌లో వెలుగు చూసింది ఈ ఘటన. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ కుర్రాడు ఎంతో ఉత్సాహంగా జానపద గీతాన్ని పాడుతున్నట్లు వైరల్ అవుతున్న వీడియో చూపిస్తుంది .

వీడియోలో చూసినట్లుగా, ఒక పోలీసు అధికారి ఎదురుగా ఓ బాలుడు కుర్చీలో కూర్చుని ఉన్నాడు. ఎదురుగా కూర్చుని ఎంతో హుషారుగా పాటపాడుతున్నాడు. ఈ సమయంలో బాలుడు చాలా ఉత్సాహంతో మలయాళ జానపద పాట పాడటం ప్రారంభిస్తాడు. అయితే, అతడు కూర్చుని ఉన్న కూర్చీపైనే పాటకు తగ్గ బ్యాండ్‌ కొడుతున్నాడు. అది గమనించిన సదరు పోలీస్‌ ఆఫీసర్‌ ఎదురుగా ఉన్న ఓ ప్లాస్టిక్‌ స్టూల్‌ని బాలుడి ముందు వేయమని లేడీ పోలీస్‌కి సైగ ద్వారా చెబుతాదు. దాంతో మహిళా పోలీసు ఆ కుర్రాడి ఎదురుగా ఇంకో కుర్చీ వేసింది. ఆ కుర్చీని కొడుతూ అతడు మరింత ఉత్సాహంగా పాట పాడుతున్నాడు. పోలీసులు బాలుడి పాటను ఎంజాయ్ చేస్తూ కనిపించారు.

ఇవి కూడా చదవండి

దీనికి సంబంధించిన వీడియోను కేరళ పోలీసులు తమ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్నారు, “జాకీర్ భాయ్ పోలీస్ స్టేషన్‌లోకి ప్రవేశించి పాట పాడగలరా? కానీ, అలాంటి సీన్‌ పాలక్కాడ్ నట్టుకల్ పోలీస్ స్టేషన్‌లో చూశాను” అంటూ మలయాళంలో ఈ వీడియోకి క్యాప్షన్‌ని ఇచ్చారు. ఆన్‌లైన్‌లో షేర్ చేయబడిన తర్వాత, వీడియో 4 లక్షలకు పైగా వీక్షణలు మరియు లైక్‌లను సంపాదించింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు కూడా బాలుడి పాటను విని ఆనందిస్తున్నారు. ఓ నెటిజన్ ఈ సన్నివేశాన్ని యాక్షన్ హీరో బిజు సన్నివేశంతో పోల్చాడు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి