Video Viral: ఈ చిన్నారికి ధైర్యం ఎక్కువే.. నల్లపాము ఒళ్లంతా పాకేస్తున్నా.. ఏ మాత్రం భయం లేకుండా
పాము (Snake).. ఈ పేరు వినగానే భయంతో వణికిపోతారు. ఎందుకంటే పాములు ఎంత విషపూరితమో మనందరికీ తెలిసిందే. అందుకే ఇవి కనిపిస్తే వెంటనే అక్కడి నుంచి పరుగు అందుకుంటాం. అయితే ఓ చిన్నారి మాత్రం విషపూరిత నల్లపాముతో ఉన్న....
పాము (Snake).. ఈ పేరు వినగానే భయంతో వణికిపోతారు. ఎందుకంటే పాములు ఎంత విషపూరితమో మనందరికీ తెలిసిందే. అందుకే ఇవి కనిపిస్తే వెంటనే అక్కడి నుంచి పరుగు అందుకుంటాం. అయితే ఓ చిన్నారి మాత్రం విషపూరిత నల్లపాముతో ఉన్న వీడియో సోషల్ మీడియాను (Social Media) షేక్ చేస్తోంది. ఈ క్లిప్‌లో ఓ పాము అమ్మాయిపై పాకుతున్న దృశ్యాలు మనకు కనిపిస్తాయి. అయితే పాము ఒళ్లంతా పాకేస్తున్నా ఆ బాలికలో ఎలాంటి భయం కనిపించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. వైరల్ అవుతున్న వీడియోలో.. ఒక చిన్నారి నేలపై పడుకుంటుంది. అదే సమయంలో ఆమె శరీరంపై నలుపు రంగులో ఉన్న ప్రమాదకరమైన పాము పాకుతోంది. దీనికి ఆమె ఏ మాత్రం భయపడకుండా ఆనందంగా పాముతో ఆడుకుంటుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ క్లిప్ స్నేక్‌మాస్టెరెక్సోటిక్స్ అనే పేజీ నుంచి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ అయింది.
ఇవి కూడా చదవండిView this post on Instagram
రెండు రోజుల క్రితం అప్‌లోడ్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఇది చూసిన నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇవి చాలా ప్రమాదకరమైన జీవులు అని, వాటికి దూరంగా ఉండాలని ఒకరు, ఇలాంటి పనులు భవిష్యత్తులో ఆమెకు హాని కలిగించవచ్చని కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి