Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railway : రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఇస్కాన్ వారు అందించే ఉల్లిపాయలు లేని ఫుడ్ మీకోసం..

Railway Food Menu: IRCTC సహాయంతో ఇండియన్ రైల్వేస్ ఇస్కాన్, గోవింద రెస్టారెంట్‌తో జతకట్టింది. ఇప్పుడు మీరు గోవింద రెస్టారెంట్ నుంచి ఆహారాన్ని ఆర్డర్ చేయడం ద్వారా రైలులో ఆనందించవచ్చు.

Indian Railway : రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఇస్కాన్ వారు అందించే ఉల్లిపాయలు లేని ఫుడ్ మీకోసం..
Railway Food Menu
Follow us
Sanjay Kasula

| Edited By: Ravi Kiran

Updated on: Jul 30, 2022 | 7:45 AM

శ్రావణ మాసం మొదలైంది. మీరు కోరుకునే రీతిలో ఆహారం కోసం చింతించాల్సిన అవసరం లేదు. మీరు రైలులో ప్రయాణిస్తున్నప్పుడు.. మీ ప్రయాణంలో స్వచ్ఛమైన శాఖాహార ఆహారాన్ని పొందవచ్చు. ఈ మాసంలో చాలా మంది ఉల్లిపాయలు తినరు. అటువంటి పరిస్థితిలో మీరు శాఖాహారం ఇష్టపడితే, మీరు అలాంటి ఆహారాన్ని ఆర్డర్ చేయవచ్చు. మీరు ఇప్పుడు రైలులో ప్రయాణిస్తున్నప్పుడు పూర్తిగా సాత్విక ఆహారాన్ని పొందగలుగుతారు. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) సహాయంతో ఇస్కాన్, గోవింద రెస్టారెంట్‌తో భారతీయ రైల్వేలు టైఅప్  అయ్యింది. రెస్టారెంట్ నుంచి మీరు ఆహారం బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు గోవింద రెస్టారెంట్ నుంచి ఆహారాన్ని ఆర్డర్ చేయడం ద్వారా రైలులో ఆనందించవచ్చు.

మీరు కోరుకున్న స్టేషన్లలో.. 

IRCTC ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ స్టేషన్ నుంచి మొదలు అన్ని స్టేషన్లలో శాఖాహార ప్రయాణీకులకు ఈ సౌకర్యాన్ని అందిస్తోంది. రైల్వే వర్గాల అందించిన సమాచారం ప్రకారం, శ్రావణ మాసంలో ఈ సౌకర్యంపై మంచి స్పందన లభించింది . మరో స్టేషన్‌లో కూడా శాఖాహార ఆహార వ్యవస్థను ప్రారంభించాలని రైల్వే భావిస్తోంది. రైల్వేలోని వివిధ జోన్లలో ఈ సదుపాయం ప్రవేశపెట్టడంతో సాత్విక ఆహారం తినే వారికి మేలు జరుగుతుంది.

ప్యాంట్రీపై..

ప్రయాణికులకు అనుమానం ప్యాంట్రీలోని ఆహారం స్వచ్ఛతపై ప్రయాణికులు చాలాసార్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారని రైల్వే బోర్డు చెబుతోంది. దీంతో దూర ప్రయాణాలు చేసే వారికి ఇబ్బందులు ఎదురవుతాయి. ఉల్లి, వెల్లుల్లి కూడా తినని ప్రయాణికులకు సాత్విక్ ఆహారం తరచుగా లభించదు. ఇప్పుడు అలాంటి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ప్రయాణీకులు రైలులో సాత్విక ఆహారాన్ని తినడానికి ఇష్టపడతారు. మీరు గోవింద రెస్టారెంట్ నుంచి ఆహారం అడగడం ద్వారా తినవచ్చు. రెండో స్టేషన్‌లో త్వరలో ఈ సదుపాయం ప్రారంభమవుతుందని భావిస్తున్నారు.

మీరు ఈ సేవను

సద్వినియోగం చేసుకోవడం ద్వారా సాత్విక ఆహారం కోసం అడగాలనుకుంటే , మీరు IRCTC ఇ-క్యాటరింగ్ వెబ్‌సైట్ లేదా ఫుడ్ ఆన్ ట్రాక్ యాప్‌లో బుక్ చేసుకోగలరు. రైలు బయలుదేరడానికి కనీసం 2 గంటల ముందు ప్రయాణికులు PNR నంబర్‌తో ఆర్డర్ చేయాలి. దీని తరువాత, సాత్విక ఆహారం మీ ఆసనానికి చేరుకుంటుంది.

ఆహారంలో ఏమి దొరుకుతుంది..

ఆధ్యాత్మిక యాత్రకు వెళ్లే వ్యక్తులను దృష్టిలో ఉంచుకుని ఈ సేవ ప్రారంభించబడిందని IRCTC తెలిపింది. తొలిదశలో మంచి రెస్పాన్స్‌ వస్తే మరింత విస్తరిస్తామన్నారు. మెనూలో డీలక్స్ థాలీ, మహారాజా థాలీ, పాత ఢిల్లీ వెజ్ బిర్యానీ, పనీర్ వంటకాలు, నూడుల్స్, దాల్ మఖానీ వంటి అనేక సాత్విక్ వంటకాలు ఉన్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం..