Crime: ఇంటిని దోచేసి.. దొంగలు పడ్డారని కట్టుకథ అల్లి.. అచ్చం సినిమాను తలపించేలా
కంచే చేను మేసినట్లు - అనే సామెతను వినే ఉంటారు. దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) సరిగ్గా ఇలాంటి ఘటనే జరిగింది. ఇంట్లో నమ్మకంగా పని చేస్తున్న వ్యక్తే ఇంటికి కన్నమేశాడు. యజమాని అమెరికాకు వెళ్తూ ఇంటి తాళాలు పనిచేస్తున్న వ్యక్తికి ఇచ్చి వెళ్లాడు....
కంచే చేను మేసినట్లు – అనే సామెతను వినే ఉంటారు. దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) సరిగ్గా ఇలాంటి ఘటనే జరిగింది. ఇంట్లో నమ్మకంగా పని చేస్తున్న వ్యక్తే ఇంటికి కన్నమేశాడు. యజమాని అమెరికాకు వెళ్తూ ఇంటి తాళాలు పనిచేస్తున్న వ్యక్తికి ఇచ్చి వెళ్లాడు. యజమాని వెళ్లాక అతనిలో దుర్బుద్ధి రేగింది. ఇంట్లో ఉన్న డబ్బు, బంగారం తీసుకుని కారుతో స్వగ్రామానికి పయనమయ్యాడు. అంతేకాకుండా యజమానికి ఫోన్ చేసి, దొంగతనం జరిగినట్లు చెప్పాడు. ఆయన ఇండియాకు (India) వచ్చి, ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి కంప్లైంట్ తో కేసు నమోదు చేసుకున్న పోలీసులు..సీసీ కెమెరా ఆధారంగా దర్యాప్తు చేపట్టగా అసలు విషయాలు బయటపడ్డాయి. ఢిల్లీలోని పంజాబీ బాఘ్ ప్రాంతానికి చెందిన ఓ ఇంట్లో బిహార్‌కు చెందిన మోహన్ కుమార్ ఐదేళ్లుగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో ఇంటి యజమాని ఈ నెల 4న అమెరికా వెళ్లాడు. ఇంటి తాళాలను మోహన్ కుమార్ కు ఇచ్చి పయనమయ్యాడు. కాగా ఈ నెల 18న ఇంట్లో దొంగతనం జరిగిందంటూ మోహన్ కుమార్ యజమానికి సమాచారం అందించాడు. కారు, డబ్బు, నగలు తీసుకుని వెళ్లిపోయినట్లు వివరించాడు.
దీంతో హుటాహుటిన అమెరికా నుంచి ఇంటికి వచ్చిన యజమాని.. పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. అందులో మోహన్ కుమార్, మరో వ్యక్తితో కలిసి సూట్‌కేసు తీసుకుని కారులో వెళ్తున్నట్లు గుర్తించారు. మోహన్ ఆ కారును రమేశ్ నగర్ మెట్రో స్టేషన్ వద్ద వదిలేసి, బిహార్‌కు వెళ్లాడు. కాగా.. దొంగతనానికి పాల్పడిన మోహన్ కుమార్, అతనికి సహకరించిన మరో వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.5లక్షలు డబ్బు, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.
మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి