Mumbai: మహిళ ప్రాణం తీసిన టమోటా.. టీవీ చూస్తూ అలా చేయడం వల్లే..!

Mumbai: ఆకలేస్తే చాలా మంది మ్యాగీ వైపు చూస్తుంటారు. ఎందుకంటే.. అది చాలా త్వరగా పూర్తవుతుంది కాబట్టి. ఇంకా చెప్పాలంటే..

Mumbai: మహిళ ప్రాణం తీసిన టమోటా.. టీవీ చూస్తూ అలా చేయడం వల్లే..!
Maggi
Follow us
Shiva Prajapati

|

Updated on: Jul 29, 2022 | 8:14 PM

Mumbai: ఆకలేస్తే చాలా మంది మ్యాగీ వైపు చూస్తుంటారు. ఎందుకంటే.. అది చాలా త్వరగా పూర్తవుతుంది కాబట్టి. ఇంకా చెప్పాలంటే.. టైమ్ పాస్ కోసం కూడా చాలా మంది మ్యాగీ చేసుకుని, టీవీ ముందుకు కూర్చుని తీరిగ్గా తింటారు. అయితే, ఈ మ్యాగీలో వేసిన టమోటా ఓ మహిళ ప్రాణాలు తీసింది. దాదాపు వారం రోజులు ఆస్పత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడిన ఆమె.. తుదిశ్వాస విడిచింది. ఈ ఘటన మహారాష్ట్ర ముంబైలోరి మలాద్ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఇంతకీ టమోటా ఎలా ప్రాణం తీసిందో ఇప్పుడు తెలుసుకుందాం.

మార్వేలోని పాస్కల్ బారీలో నివాసముంటున్న రేఖా దేవి నిషాద్(35) .. ఇంట్లో ఎలుకల బెడద ఎక్కువ అవడంతో.. వాటిని చంపేయాలని ప్లాన్ వేసింది. ఇందులో భాగంగా ఎలుకల మందు తీసుకువచ్చి.. టమోటాలో పెట్టి, ఎలుకలకు ఎరగా వేసింది. ఆ తరువాత తీరిద్దగా మ్యాగీ చేసుకుంది. అయితే, ఆ మ్యాగీలో ఏమరపాటుతో ఎలుకల మందు పెట్టిన టమోటా వేసింది. ఆ తరువాత టీవీ చూస్తూ ఆ మ్యాగీని తినేసింది. దాంతో ఆమె తీవ్ర అస్వస్థతకు గురైంది. అది గమనించిన భర్త వెంటనే ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. వారం రోజుల పాటు చికిత్స పొందిన రేఖా.. చివరకు ప్రాణాలు కోల్పోయింది. రేఖ మృతిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..