AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Visakhapatnam: జూలో దారుణ ఘటన.. లైక్స్ కోసం ప్రాణాలను పణంగా పెట్టి జంవుతులను హింసిస్తూ వీడియో తీసిన యువకులు..

జూ లో జంవుతులను హింసించిన ఘటన విశాఖ పట్నంలో చోటు చేసుకుంది. అంతేకాదు తాము చేస్తోంది గొప్ప కార్యం అన్నచందంగా జంవుతులను హింసిస్తూ.. వీడియోలను తీసుకున్నారు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఈ సైకోలు.. 

Visakhapatnam: జూలో దారుణ ఘటన.. లైక్స్ కోసం ప్రాణాలను పణంగా పెట్టి జంవుతులను హింసిస్తూ వీడియో తీసిన యువకులు..
Vsp Zoo
Surya Kala
|

Updated on: Jul 30, 2022 | 1:08 PM

Share

Visakhapatnam: రోజురోజుకీ మనిషి మంచి చెడుల విచక్షణ కోల్పోతున్నాడు. దయ, కరుణ, జాలి మానవత్వం వంటివి మాయమైపోతున్నాయి.  సాటి మనుషుల విషయంలోనే  కాదు.. పశుపక్షాదుల పట్ల కూడా రాక్షసుడిగా ప్రవర్తిస్తున్నాడు. కుక్కలను, ఏనుగులు వంటి జంతువులను హిసించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తూనే ఉన్నాయి. తాజాగా జూ(Zoo) లో జంవుతులను హింసించిన ఘటన విశాఖపట్నంలో చోటు చేసుకుంది. అంతేకాదు తాము చేస్తోంది గొప్ప కార్యం అన్నచందంగా జంవుతులను హింసిస్తూ.. వీడియోలను తీసుకున్నారు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఈ సైకోలు..

విశాఖపట్నంలోని జూలోని కొన్ని జంతువులను ఐదుగురు యువకులు హింసించారు. అడవి పందులు, తాబేళ్ల ఎన్ క్లోజర్ లోకి వెళ్లి యువకులు వాటిని బెదరగొట్టారు. తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. అంతేకాదు తాము చేస్తోంది ఎదో గొప్ప పని అన్నచందంగా జంతువులను హింసిస్తూ.. సెల్ ఫోన్ లో ఆ దృశ్యాలను చిత్రీకరించారు. అనంతరం ఆ వీడియోలను ఇన్స్టాగ్రాంలో అప్ లోడ్ చేశారు ఆ యువకులు. ఈ దారుణ ఘటన గత నెల 29న జరిగింది. అయితే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ ఐదుగురు యువకులు మారిక వలస కు చెందినవారీగా గురించిన జూ క్యురేటర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు జూ లో జంతువులను హింసించిన ఐదుగురు యువకులను అరెస్ట్ చేశారు.

జూ క్యురేటర్ నందిని సలారియా మాట్లాడుతూ.. జూ లోని అడవి పంది ఎన్ క్లోజర్ లోకి ముగ్గురు యువకులు వెళ్లి దాన్ని రెచ్చ గొట్టారని చెప్పారు, అంతేకాదు ఆ సమయంలో చిత్రీకరించిన ఆ వీడియో లను లైక్స్ కోసం సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు. సరదా కోసం ప్రాణాలను ఫణంగా పెట్టారని… జూ ఉంది జంతువుల పై అవగాహన పెంపొదించుకోవడం కోసమే కానీ ఇలాంటి అరాచకాలకు కాదన్నారు నందిని సలారియా. ఇలాంటి నేరాలు ఎవరు పాల్పడినా వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని..  దాదాపు 6 సంవత్సరాలు శిక్ష పడుతుందన్నారు. ఇలాంటి పనుల వలన యువకుల జీవితాలు నాశనం అవుతాయని చెప్పారు. యువకులు ఇలాంటి ఘటనలు పాల్పడడం.. జూ సెక్యూరిటీ వైఫల్యంగా కూడా దీన్ని చూస్తున్నామని.. సెక్యూరిటీ ఏజెన్సీ కి కూడా నోటీస్ లు ఇచ్చామని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..