Andhrapradesh Rains: ఏపీలో భారీ వర్షాలు.. ఇసుక తవ్వకాలతో కోతకు గురవుతున్న గోదావరి గట్టు.. ఆలయం కూలిన ఘటన వీడియో వైరల్
పురుషోత్తమ పట్నం పాత లాంచీల రేవు వద్ద గోదావరి గట్టు కోతకు గురైంది. దీంతో గోదావరి గట్టు ఒడ్డున ఉన్న దుర్గమ్మ ఆలయం కూలిపోయింది. అమ్మవారి విగ్రహంతో సహా నదిలోకి కొట్టుకొని పోయింది. పురుషోత్తమ పట్నం వద్ద భారీగా ఇసుక తవ్వకాలు జరపడం వల్లనే అంటూ గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Andhrapradesh Rains: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు(Rains In Telugu States) దంచి కొడుతున్నాయి. గత కొన్ని రోజులుగా ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా జోరు వానలు కురిశాయి. అటు అనేక ఊర్లలో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారు. లంకల గ్రామాల్లో వరద నీరు తగ్గు ముఖం పట్టినా.. మరోవైపు కురుస్తున్న భారీ వర్షాలతో జన జీవనం అస్తవ్యస్తంగా మారింది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలంలో అనుకోని ఘటన జరిగింది. పురుషోత్తమ పట్నం పాత లాంచీల రేవు వద్ద గోదావరి గట్టు కోతకు గురైంది. దీంతో గోదావరి గట్టు ఒడ్డున ఉన్న దుర్గమ్మ ఆలయం కూలిపోయింది. ఆలయంలో భక్తులెవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రస్తుతం ఈ ప్రమాదానికి సంబందించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఆలయం 15 ఏళ్ళక్రితం నిర్మించారు. శ్రావణ శుక్రవారం కావడంతో భారీ సంఖ్యలో మహిళలు ఉదయం పూజలు నిర్వహించారు. అయితే సాయంత్రం ఆలయం నదిలోకి కూలిపోవడంతో పాటు.. అమ్మవారి విగ్రహంతో సహా నదిలోకి కొట్టుకొని పోయింది. ఈ దారుణానికి కారణం పోలవరం ప్రాజెక్ట్ కోసం అంటూ.. పురుషోత్తమ పట్నం వద్ద భారీగా ఇసుక తవ్వకాలు జరపడం వల్లనే అంటూ గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వైరల్ వీడియో
ఇక ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. శ్రీశైలం జలాశయానికి ఇన్‌ఫ్లో పెరుగుతోంది. ప్రస్తుతం ఇన్‌ఫ్లో 77,274 క్యూసెక్కులు.. ఔట్ ఫ్లో : 36,765 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్దాయి నీటి మట్టం 885.00 అడుగులకు.. ప్రస్తుతం : 879.20 అడుగులకు చేరింది. గోదావరికి వరదలు వస్తున్నా.. కృష్ణా ప్రాజెక్టులకు అనుకున్న స్థాయిలో నీరు రావడం లేదు. అయితే నెమ్మదిగా అయినా.. ఇప్పుడు కురుస్తున్న వర్షాలకు వరద వచ్చి చేరుతుండడంతో క్రమంగా నిండుతున్నాయి. సీజన్ ముగిసే సరికి కృష్ణా ప్రాజెక్టులు కళకళలాడతాయంటున్నారు అధికారులు. ఇక తెలంగాణలో మరో వారం రోజుల పాటు వర్షాలు పడే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..