Azadi ka Amrit Mahotsav: ఎప్పటికీ చిరంజీవి ఈ గోండు గిరిజన బెబ్బులి.. నిజాం సైన్యానికి వ్యతిరేకంగా పోరాడిన ధీరుడు..

బ్రిటీష్ వారు దేశంలోని సహజ సంపదను స్వాధీనం చేసుకోవడం ప్రారంభించిన కాలం అది. హైదరాబాద్ నిజాం బ్రిటిష్ వారితో ఒప్పందంతో పాలిస్తున్నాడు. అందుకే గిరిజనులకు అన్యాయం, దౌర్జన్యాలు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి

Azadi ka Amrit Mahotsav: ఎప్పటికీ చిరంజీవి ఈ గోండు గిరిజన బెబ్బులి.. నిజాం సైన్యానికి వ్యతిరేకంగా పోరాడిన ధీరుడు..
Azadi Ka Amrit Mahotsav
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Aug 02, 2022 | 6:58 PM

Azadi ka Amrit Mahotsav: బ్రిటిష్ పాలకుల దురాగతాలకు, దోపిడీకి వ్యతిరేకంగా స్వాతంత్య్ర ఉద్యమంలో దూకిన ఎందరో విప్లవకారులు దేశం కోసం ప్రాణాలర్పించారు. అలాంటి  స్వాతంత్య్ర సమర గిరిజన యోధుడు కొమరం భీముడు. హైదరాబాద్ నిజాం, బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా నీరు, అడవి, భూమి అనే నినాదంతో పోరు బాట పట్టాడు.  సొంత గొరిల్లా సైన్యంతో బ్రిటీష్ , హైదరాబాద్ నిజాంపాలకులపై యుద్ధం చేశాడు. ఎన్నోసార్లు యుద్ధంలో హైదరాబాద్ సైన్యాన్ని ఓడించినా చివరకు వీర మరణం పొందాడు.  కొద్ది నెలల క్రితం విడుదలైన RRR చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ పాత్ర ఈ కొమరం భీమ్ నుండి ప్రేరణ పొందిందే.

చిన్నప్పటి నుంచి కష్టపడిన కొమరం భీముడు కొమరం భీమ్ 1901లో ఆసిఫాబాద్ జిల్లా సంకపల్లి గ్రామంలో జన్మించారు. తండ్రి పేరు కొమరం చిన్ను. గోండు గిరిజన తెగలో పుట్టిన కొమరం పేదరికంతో చదువుకొనలేకపోయాడు. చిన్నప్పటి నుంచి కష్టపడి బతికేవాడు.

అన్యాయం, దౌర్జన్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటు బ్రిటీష్ వారు దేశంలోని సహజ సంపదను స్వాధీనం చేసుకోవడం ప్రారంభించిన కాలం అది. హైదరాబాద్ నిజాం బ్రిటిష్ వారితో ఒప్పందంతో పాలిస్తున్నాడు. అందుకే గిరిజనులకు అన్యాయం, దౌర్జన్యాలు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. పంటల ద్వారా వచ్చే ఆదాయంపై పన్ను విధించారు. పన్ను కట్టకపోతే నిజం నవాబులు దారుణానికి ఒడిగట్టారు. వీటిని చూసిన కొమరం భీముడు తిరుగుబాటు చేసి హైదరాబాద్‌ను అసఫ్ షాహీ వంశం నుంచి కాపాడతానని ప్రకటించాడు.

ఇవి కూడా చదవండి

నీరు, అడవి, భూమి మా సొంతం అనే నినాదం కొమరం భీమ్ తిరుగుబాటు బావుటా ఎగురవేశాడు. అడవుల్లో నివసించే ప్రజలకే అడవిలోని అన్ని వనరులపై హక్కు ఉంటుందని, ఇందులో నిజాం జోక్యం చేసుకోవద్దని నీరు, అడవి, భూమి మా సొంతం అంటూ నినాదంతో నిజాం నవాబులు వ్యతిరేకంగా పోరాటం మొదలు పెట్టాడు.

భగత్ సింగ్ ప్రభావం దక్షిణాది చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం.. కొమరం భీముడుపై భగత్ సింగ్ ప్రభావం తీవ్రంగా ఉందని తెలుస్తోంది. హైదరాబాద్ నిజాం, బ్రిటీష్ రాజ్‌పై పోరాటాన్ని ప్రకటించిన సమయంలో..  దేశంలో స్వాతంత్య్ర ఉద్యమం వేగంగా జరుగుతోంది. భగత్ సింగ్ తన ప్రాణాలను అర్పించాడు.  కొమరం భీమ్‌ కూడా భగత్‌సింగ్‌ పోరాటంతో  ప్రభావితమయ్యాడని.. అంతేకాదు తన భూమిని రక్షించుకోవడం కోసం తమ ప్రాణత్యాగం చేసిన గిరిజన యోధుల ప్రభావం కూడా ఉందని చెబుతారు.

నిజాం నియమించిన కౌలుదారుడు హత్య  గిరిజన ప్రాంతాల్లో కౌలు, పన్నుల వసూలు కోసం హైదరాబాద్ నిజాం కౌలుదారులను నియమించాడు. సిద్ధిఖీ  అనే కౌలుదారుడు గిరిజన గ్రామంలో బలవంతంగా అద్దె వసూలు చేయడం ప్రారంభించాడు. అంతేకాదు కౌలుదారు సిద్ధిఖీ గిరిజనులపై దౌర్జన్యం చేసి బలవంతంగా అద్దె వసూలు ప్రారంభించాడు. దీంతో సిద్ధిఖీని కొమరం భీముడు చంపాడు. అప్పటి నుంచి కొమరం భీముడు గ్రామం వదిలి అడవులను ఆశ్రయించాడు.

సొంత గొరిల్లా సైన్యం ఏర్పాటు  కొమరం భీముడు తిరుగుబాటు చేస్తున్నాడనే వార్త నిజాంకు చేరింది. దీంతో భీముడిని పట్టుకోవడానికి నిజాం చాలాసార్లు సైన్యాన్ని పంపాడు. అయితే అప్పటికే కొమరం భీముడు తన గొరిల్లా సైన్యాన్ని కూడా సిద్ధం చేసుకున్నాడు. దీంతో హైదరాబాద్ సైన్యం దాడి చేసిన ప్రతిసారీ కొమరం భీముడు అడవులను ఆధారంగా చేసుకుని యుద్ధం చేసేవాడు. ఎప్పుడూ నిజాం సైన్యం కొమరం భీముడు చేతిలో ఓడిపోయేది.

నిజాం ఒప్పందాన్ని తిరస్కరించిన కొమరం భీముడు  నిరంతర ఓటమి పాలుకావడంతో  హైదరాబాద్ నిజాం రాజీబాట పట్టాడు. తన దూతను కొమరం భీమ్ వద్దకు అనేకసార్లు పంపి.. రాజీకి ప్రతిపాదించాడు, కానీ కొమరం భీముడు దానిని తిరస్కరించాడు.  దీంతో నిజాం యుద్ధానికి పెద్ద దళాన్ని పంపాడు.

1940లో మోసంతో ప్రాణాలు కోల్పోయిన కొమరం భీముడు:

1928 నుంచి 1940 వరకు కొమరం భీమా నిరంతరం నిజాం, బ్రిటిష్ వారితో పోరాడుతూనే ఉన్నాడు. ఎప్పుడు వారిని ఓడిస్తూనే ఉన్నాడు. అయితే 1940లో నిజాం మరోసారి కొమరం భీముడిపై యుద్ధానికి భారీగా సైన్యాన్ని పంపించాడు. ఈ సారి అయినవారి మోసంతో నిజాం సైన్యంతో పోరాడుతూ అమరుడయ్యాడు. అయితే మరణించి చిరంజీవి. ఆదివాసీల గుండెల్లో ఇప్పటికీ సజీవంగానే ఉన్నాడు.. ఆదిలాబాద్ జిల్లాలో అనేక చోట్ల దేవుడిలా పూజలు అందుకుంటున్నాడు.

ఆర్‌ఆర్‌ఆర్‌లో  ఎన్టీఆర్ పాత్ర ఆయనకు అంకితం: ఇటీవల విడుదలైన భారీ బడ్జెట్ తెలుగు సినిమా  RRR లో Jr NTR పాత్ర కొమరం కొమరం భీమ్‌కు అంకితం చేసింది చిత్ర యూనిట్. ఈ చిత్రం కల్పితమే అయినప్పటికీ.. ప్రధాన పాత్ర భీముడు.. కొమరం భీముడి వ్యక్తిత్వం, పోరాటాలను దృష్టిలో ఉంచుకుని సృష్టించారు. సినిమాలోని పాత్రకు భీముడు అనే పేరు పెట్టారు.

జిల్లా పేరు మార్పు: ఆసిఫాబాద్ జిల్లా పేరును 2016లో కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాగా మార్చారు. ఇక్కడ ఒక స్మారక చిహ్నం, కొమరం భీమ్ మ్యూజియం స్థాపించారు. ఈ గిరిజన వీర యోధుని గురించి సమాచారాన్ని ఇక్కడ మ్యూజియంలో పొందవచ్చు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
పవన్ జల్సా మూవీ హీరోయిన్ ఇంతగా మారిపోయిందేంటీ..?
పవన్ జల్సా మూవీ హీరోయిన్ ఇంతగా మారిపోయిందేంటీ..?
రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఆ ఐదు కిలోమీటర్ల పరిధి ఎత్తివేత..
రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఆ ఐదు కిలోమీటర్ల పరిధి ఎత్తివేత..
అబ్బాయిలతో ఫోన్‌ మట్లాడొద్దని మందలించినందుకు..అన్నను చంపిన చెల్లి
అబ్బాయిలతో ఫోన్‌ మట్లాడొద్దని మందలించినందుకు..అన్నను చంపిన చెల్లి
ఉర్ఫీ మ్యాజికల్ బట్టర్ ఫ్లై డ్రెస్ పై సమంత కామెంట్స్..
ఉర్ఫీ మ్యాజికల్ బట్టర్ ఫ్లై డ్రెస్ పై సమంత కామెంట్స్..
ఫిక్స్‌డ్ డిపాజిట్ నుంచి నెలవారీ వడ్డీని ఎలా పొందాలి ?
ఫిక్స్‌డ్ డిపాజిట్ నుంచి నెలవారీ వడ్డీని ఎలా పొందాలి ?
ఎంఐఎం - కాంగ్రెస్ కార్యకర్తల మధ్య కత్తుల దాడి.. ఒకరు మృతి
ఎంఐఎం - కాంగ్రెస్ కార్యకర్తల మధ్య కత్తుల దాడి.. ఒకరు మృతి
స్కూల్‌కు లేట్‌గా వచ్చిందని.. టీచర్‌పై ప్రిన్సిపాల్‌ దాడి
స్కూల్‌కు లేట్‌గా వచ్చిందని.. టీచర్‌పై ప్రిన్సిపాల్‌ దాడి
జియోలో వార్షిక రీఛార్జ్‌ ప్లాన్స్‌ ఎలా ఉన్నాయో తెలుసా..? హైస్పీడ్
జియోలో వార్షిక రీఛార్జ్‌ ప్లాన్స్‌ ఎలా ఉన్నాయో తెలుసా..? హైస్పీడ్
దేవర ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే..
దేవర ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే..
ఇవాళ్టి నుంచి అగ్రనేతల తుది విడత ప్రచారం.. ఎవరెవరు.. ఎక్కడెక్కడ?
ఇవాళ్టి నుంచి అగ్రనేతల తుది విడత ప్రచారం.. ఎవరెవరు.. ఎక్కడెక్కడ?