Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Azadi Ka Amrit Mahtosav: స్వాతంత్య్రం కోసం పోరాడి.. స్వాతంత్య్రం వచ్చిందని తెలియని మతిమరుపుతోనే అమరుడైన చరిత్ర చెప్పని వీరుడు బతుకేశ్వర్ దత్

స్వాతంత్య్రోద్యమంలో జరిగిన అతి పెద్ద సంఘటనల్లో ఈ బాంబు ఘటనలో వీరిద్దరూ ఇద్దరు ప్రధాన పాత్ర పోషిస్తే.. కేవలం భగత్ సింగ్ మాత్రమే నేటి తరాలకు గుర్తుండి పోయారు. స్వతంత్ర భారతంలో వీరుడిలా పూజలు అందుకోవాల్సిన బతుకేశ్వర్ దత్ చరిత్ర మరుగున పడిపోయారు.  

Azadi Ka Amrit Mahtosav: స్వాతంత్య్రం కోసం పోరాడి.. స్వాతంత్య్రం వచ్చిందని తెలియని మతిమరుపుతోనే అమరుడైన చరిత్ర చెప్పని వీరుడు బతుకేశ్వర్ దత్
Batukeshwar Dutt
Follow us
Surya Kala

| Edited By: Team Veegam

Updated on: Jul 27, 2022 | 2:55 PM

Azadi Ka Amrit Mahtosav: 1929 సంవత్సరం ఏప్రిల్ లో సెంట్రల్ అసెంబ్లీలో అకస్మాత్తుగా బాంబు పేలుళ్లతో ప్రతిధ్వనించింది. ఇద్దరు యువకులు తమ సీట్లలో నుండి లేచి కొన్ని కరపత్రాలను విసిరి ‘ఇంక్విలాబ్ జిందాబాద్’ నినాదాలు చేయడం ప్రారంభించారు. కావాలంటే ఆ ఇద్దరు యువకులు పారిపోయేవారు.. అయితే తమ గొంతును ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తమను అరెస్టు చేయాలని భావించారు. అందుకే సెంట్రల్ అసెంబ్లీలో బాంబులు విసిరి.. తమ గళం పదిమందికి వినిపించేలా చేశారు.. ఈ యువకులు మరెవరో కాదు భగత్ సింగ్, బతుకేశ్వర్ దత్. అరెస్టయిన తర్వాత భగత్ సింగ్, బతుకేశ్వర్ దత్ ‘చెవిటి వారికి వినిపించాలంటే బాంబు పేలుడు కావాలి’ అని చెప్పారు. స్వాతంత్య్రోద్యమంలో జరిగిన అతి పెద్ద సంఘటనల్లో ఈ బాంబు ఘటనలో వీరిద్దరూ ఇద్దరు ప్రధాన పాత్ర పోషిస్తే.. కేవలం భగత్ సింగ్ మాత్రమే నేటి తరాలకు గుర్తుండి పోయారు. స్వతంత్ర భారతంలో వీరుడిలా పూజలు అందుకోవాల్సిన బతుకేశ్వర్ దత్ చరిత్ర మరుగున పడిపోయారు.

పశ్చిమ బెంగాల్‌లో పుట్టి, కాన్పూర్‌లో చదువుకున్నారు బతుకేశ్వర్ దత్ పశ్చిమ బెంగాల్‌లోని బర్ధమాన్ జిల్లాలోని ఒక గ్రామంలో 1910 నవంబర్ 18న జన్మించారు. తన పేరును సంక్షిప్తంగా బి.కె.దత్ అని రాసుకునేవారు. తండ్రి పేరు గోష్ఠ బిహారీ దత్ , తల్లి పేరు కామినీ దేవి. ప్రాధమిక విద్యాభ్యాసం తర్వాత బతుకేశ్వర్ దత్ పెద్ద చదువుల కోసం  కాన్పూర్ వచ్చారు, అతను PPN కాలేజీ నుండి గ్రాడ్యుయేషన్ చదువుకుంటున్న సమయంలో ఇతర విప్లవకారులతో పరిచయం ఏర్పడింది. దీంతో భారత దేశానికి స్వాతంత్య్రం తీసుకుని రావాలని..  హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ (HRA) లో చేరారు.

భగత్ సింగ్ కలిశారు బతుకేశ్వర్ దత్ 1924లో కేవలం 14 సంవత్సరాల వయస్సులో HRAలో చేరారు. అదే సమయంలో భగత్ సింగ్ కూడా చేరారు. విప్లవాత్మక ఆలోచనలు ఇద్దరినీ దగ్గర చేసింది. ఇద్దరూ మంచి స్నేహితులు అయ్యారు. కాన్పూర్ చరిత్ర పుస్తకం ప్రకారం.. వీరిద్దరికి అక్కడే చంద్రశేఖర్ ఆజాద్‌ను కలిశారు.

ఇవి కూడా చదవండి

కాకోరి సంఘటన తర్వాత HRA HSRA అయింది కాకోరిలో నిధిని దోచుకున్న తరువాత బ్రిటిష్ వారు విప్లవకారులపై అణిచివేతను తీవ్రతరం చేశారు. ఇది హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ (HRA)పై ప్రభావం చూపింది..  కాబట్టి చంద్రశేఖర్ ఆజాద్ స్వాతంత్ర్య ఉద్యమాన్ని తీవ్రతరం చేయడానికి హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ ఆర్మీ (HSRA) ను ఏర్పాటు చేశారు.

బాంబు కేసులో జీవిత ఖైదు శిక్ష: సెంట్రల్ అసెంబ్లీలో బాంబు విసిరిన తర్వాత భగత్ సింగ్ , బతుకేశ్వర్ దత్‌లు తమను తామే అరెస్ట్ అయ్యేలా  చేసుకున్నారు. ఇద్దరూ కలిసి లాహోర్ సెంట్రల్ జైలులో ఉన్నారు. విచారణలో ఇద్దరికీ జీవిత ఖైదు విధించబడింది. తరువాత భగత్ సింగ్‌ను లాహోర్ కుట్ర కేసు (సాండర్స్ హత్య) కోసం విచారించారు. అతను సుఖ్‌దేవ్, రాజ్‌గురుతో పాటు ఉరితీయబడ్డాడు. కృష్ణాజలాల శిక్ష కోసం బతుకేశ్వర్ దత్‌ను అండమాన్ జైలుకు పంపారు.

భగత్ సింగ్ బతుకేశ్వర్ దత్ ఆటోగ్రాఫ్ తీసుకున్నాడు: షహీద్ భగత్ సింగ్.. బతుకేశ్వర్ దత్ చేత బాగా ప్రభావితమయ్యారు. లాహోర్ సెంట్రల్ జైలులో కలిసి ఉన్న సమయంలో భగత్ సింగ్ కూడా అతని ఆటోగ్రాఫ్ తీసుకున్నారు. ఈ ఆటోగ్రాఫ్ ఇప్పటికీ భగత్ సింగ్ అసలు డైరీలో ఉంది.. దానిపై జూలై 12, 1930 తేదీ వ్రాయబడింది. ఈ డైరీ ఇప్పటికీ భగత్ సింగ్ వారసుడు యద్వేంద్ర సింగ్ సంధు వద్ద ఉంది.

అనారోగ్యం కారణంగా బంకీపూర్ జైలుకు షిఫ్ట్: అండమాన్ జైలులో ఉన్న సమయంలో బతుకేశ్వర్ దత్  ఆరోగ్యం క్షీణించడం ప్రారంభించింది. దీంతో 1937 లో అతన్ని బీహార్‌లోని బంకీపూర్ జైలుకు తరలించారు. అనారోగ్యం కారణంగా 1938 లో స్వాతంత్ర ఉద్యమంలో ఇక నుంచి పాల్గొనను అనే షరతుతో విడుదలయ్యారు. అయినప్పటికీ  బతుకేశ్వర్ దత్ మళ్లీ 1942లో ప్రారంభమైన క్విట్ ఇండియా ఉద్యమంలోకి పాల్గొన్నారు. మళ్లీ అరెస్టు చేయబడ్డారు. మళ్లీ నాలుగేళ్ల శిక్ష విధించారు.

స్వాతంత్య్రం తరువాత జీవితం: స్వాతంత్య్రం తరువాత బతుకేశ్వర్ దత్ కు మతిమరుపు వచ్చింది. దీంతోనే అతను జీవితాంతం గడిపారు. సిగరెట్ కంపెనీలో పనిచేశారు.  పాట్నాలో టూరిస్ట్ గైడ్‌గా కూడా జీవించారు. 1964లో అతని పరిస్థితి మరింత దిగజారింది. పత్రికల్లో ప్రచురితమైన కథనాల ప్రకారం కదలలేక ఢిల్లీకి తీసుకొచ్చారు. సఫ్దర్‌గంజ్ ఆసుపత్రికి చేరుకున్న ఆయన విలేకరులతో మాట్లాడుతూ బాంబులతో దద్దరిల్లిన ఢిల్లీ అసెంబ్లీని ఇలా తీసుకువస్తారని, కలలో కూడా ఊహించలేదని అన్నారు.

భగత్ సింగ్ సమాధి దగ్గర అంత్యక్రియలు జరిగాయి. బతుకేశ్వర్ దత్ అస్వస్థతకు గురైన విషయం తెలుసుకున్న అప్పటి పంజాబ్ సీఎం రాంకిషన్.. ఆయన్ను కలిసేందుకు ఢిల్లీ వచ్చారు. ఇక్కడ బతుకేశ్వర్ దత్ తన చివరి కోరిక చెప్పారు. తన మిత్రుడు భగత్ సింగ్ సమాధి దగ్గరే తన అంత్యక్రియలు నిర్వహించాలనుకున్నారు. 20 జూలై 1965న, భారతమాత ముద్దుల తనయుడు శాశ్వతంగా వీడ్కోలు తీసుకున్నారు. ఇండో-పాక్ సరిహద్దులోని హుస్సేనివాలాలో భగత్ సింగ్, రాజ్‌గురు,  సుఖ్‌దేవ్ సమాధి సమీపంలో బతుకేశ్వర్ దత్ అంత్యక్రియలను నిర్వహించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..