AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Azadi ka Amrit Mahotsav: బిజోలియా రైతుల ఉద్యమంతో బిటిష్ వారిని రాజీకి తీసుకొచ్చిన విప్లవ వీరుడు భూప్ సింగ్ గురించి మీకు తెలుసా..

తన తండ్రి, తాత అడుగుజాడలను అనుసరించి భూప్ సింగ్ బ్రిటీష్ వారిని అనేక సార్లు తిరుబాటు చేశాడు. భారత రాజధానిని కలకత్తా నుండి ఢిల్లీకి మార్చినప్పుడు అప్పటి వైరస్ లార్డ్ హార్డింజ్‌ని చంపడానికి కూడా ప్రణాళిక వేశాడు.. అయితే అది విఫలమైంది.

Azadi ka Amrit Mahotsav: బిజోలియా రైతుల ఉద్యమంతో బిటిష్ వారిని రాజీకి తీసుకొచ్చిన విప్లవ వీరుడు భూప్ సింగ్ గురించి మీకు తెలుసా..
Vijay Singh Pathik
Surya Kala
| Edited By: Anil kumar poka|

Updated on: Aug 02, 2022 | 7:02 PM

Share

Azadi ka Amrit Mahotsav: 1857 క్విట్ ఇండియా ఉద్యమ సమంయంలో బులంద్‌షహర్‌లో ఉన్న మలగర్ రాచరిక రాష్ట్రం కోసం శ్వేతజాతీయులతో పోరాడి దాదా ఇందర్ సింగ్  తన ప్రాణాలను బలిదానం చేశారు. భూప్ సింగ్ (Vijay Singh Pathik) అడుగుజాడల్లో నడుస్తూ..    బ్రిటిష్ వారిపై అనేకసార్లు పోరాడు. భారత రాజధానిని కలకత్తా నుండి ఢిల్లీకి మార్చినప్పుడు.. అతను అప్పటి వైస్రాయ్ లార్డ్ హార్డింజ్‌ని చంపాలని కూడా ప్లాన్ చేశాడు. బ్రిటీష్ వారు రాజస్థాన్‌ రైతులకు కొన్ని డిమాండ్లను విధించారు. అయితే వాటికీ వ్యతిరేకంగా బిజోలియా రైతాంగ ఉద్యమాన్ని వెలుగులోకి తెచ్చాడు.

యుక్తవయస్సులోనే విప్లవ బాట:  భూప్ సింగ్ 27 ఫిబ్రవరి 1882న బులంద్‌షహర్‌లోని గుతావాలి కలాన్ గ్రామంలోని గుజార్ కుటుంబంలో జన్మించాడు. తండ్రి పేరు హమీర్ సింగ్,  తల్లి పేరు కమల్ కుమారి. దాదా ఇందర్ సింగ్ 1857లో శ్వేతజాతీయులతో పోరాడుతూ అమరుడయ్యాడు. కుటుంబ విప్లవ నేపథ్యం తండ్రి మరణం భూప్ సింగ్ పై తీవ్ర ప్రభావం చూపింది. చిన్న వయస్సులోనే రాష్ బిహారీ బోస్ , శచీంద్ర నాథ్ సన్యాస్ వంటి విప్లవకారులతో పరిచయం ఏర్పడింది.

లార్డ్ హార్డింగ్ మీద దాడి భారతదేశ రాజధానిని కలకత్తా నుండి ఢిల్లీకి మార్చాలని బ్రిటిష్ ప్రభుత్వం నిర్ణయించింది. వైస్రాయ్ లార్డ్ హార్డింజ్‌కి స్వాగతం పలికేందుకు ఢిల్లీకి భారీ ఊరేగింపు నిర్వహించారు. ఈ ఊరేగింపులో బాంబుతో దాడి చేశాడు. లార్డ్ హర్డాంగ్ ఏనుగుపై స్వారీ చేస్తున్నాడు.. బాంబు దాడి కారణంగా అతను ఏనుగు నుండి కింద పడిపోయాడు. గాయపడ్డాడు. రాష్ బిహారీ బోస్ ఆధ్వర్యంలో ఈ దాడి జరిగింది. దాడిలో భూప్ సింగ్ చురుకుగా పాల్గొన్నాడు. ఈ దాడి నుంచి రాస్ బిహారీ బోస్‌తో పాటు జోరావర్ సింగ్, ప్రతాప్ సింగ్, భూప్ సింగ్ సహా ఇతర విప్లవకారుల పేర్లు తెరపైకి వచ్చాయి.

ఇవి కూడా చదవండి

గద్దర్ ఉద్యమానికి సమాయత్తం: లార్డ్ హార్డింజ్ హత్యలో విఫలమైన తర్వాత.. రాష్ బిహారీ బోస్ నేతృత్వంలోని విప్లవకారులు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా సాయుధ గదర్ ఉద్యమాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. అది 1915వ సంవత్సరం.. ఆ సమయంలో భూప్ సింగ్ ఫిరోజ్‌పూర్ కుట్ర కేసులో పరారీలో ఉండి రాజస్థాన్‌లో నివసిస్తున్నాడు. ఈ ఉద్యమం కోసం యువకుల బృందాన్ని ఏర్పాటు చేసి పెద్ద మొత్తంలో తుపాకులు సేకరించాడు. దురదృష్టవశాత్తు ఈ రహస్యం బయటపడింది. అంతేకాదు బ్రిటిష్ సైనికులకు భూప్ సింగ్ అతని సహాయకుడు గోపాల్ సింగ్‌తో కలిసి పట్టుబడ్డాడు. అయితే, బ్రిటిష్ వారికి ఆయుధాలు, మందుగుండు సామగ్రి లభించలేదు. దీంతో భూప్ సింగ్ ను, ఇతర విప్లవకారులతో పాటు తాడ్గర్ కోటలో బంధించారు.

విజయ్ సింగ్ పాథక్ గా పేరు మార్పు: తాడ్‌ఘర్ కోట నుండి తప్పించుకున్న భూప్ సింగ్ తన పేరును విజయ్ సింగ్ పాథిక్‌గా మార్చుకున్నాడు. రాజస్థానీ రాజ్‌పుత్‌లుగా మారువేషంలో చిత్తోర్‌గఢ్‌లో నివసించడం ప్రారంభించాడు. బిజోలియా రైతు ఉద్యమానికి నాయకత్వం వహించాడు.

దేశమంతటా నడిచిన బిజోలియా రైతు ఉద్యమం: బిజోలియా రాచరిక రాష్ట్రం. ఉదయపూర్‌లో ఒక రహస్య ప్రదేశంగా ఉంది. బ్రిటిష్ వారు రైతుల నుంచి భారీ మొత్తంలో ఆదాయాన్ని సేకరించారు. ఒక్కటి కాదు.. రెండు కాదు రైతుల నుంచి 84 రకాల పన్నులను రైతుల నుంచి వసూలు చేస్తున్నారు. అటువంటి పరిస్థితిలో.. వివిధ చోట్ల కిసాన్ పంచాయతీలు ప్రారంభించారు. బ్రిటిష్ వారికి భూమిపై పన్ను చెల్లించకూడదని నిర్ణయించారు. విజయ్ సింగ్ పాథిక్ ఈ ఉద్యమాన్ని వార్తాపత్రికలు,  పత్రికలలో ప్రముఖంగా అనేక వార్తలు రాశారు. దీంతో ఈ ఉద్యమం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

తలవంచిన బ్రిటిష్ ప్రభుత్వం: రైతుల ఉద్యమం.. నిరంతర ఆందోళనల కారణంగా బ్రిటిష్ ప్రభుత్వ పరిస్థితి క్షీణించడం ప్రారంభించింది. అటువంటి పరిస్థితిలో, బిజోలియా కిసాన్ పంచాయితీ బోర్డు, రాజస్థాన్ సేవా సంఘ్‌తో చర్చల కోసం బ్రిటిష్ ప్రభుత్వం రాజస్థాన్‌కు చెందిన ఎ జిజి హాలండ్‌ను నియమించింది. ఈ సమావేశంలో రైతుల డిమాండ్ లకు బ్రిటిష్ వారు తలవంచవలసి వచ్చింది.  84 డిమాండ్లలో 35 డిమాండ్లు ఆమోదించబడ్డాయి. అయితే మేవార్ బేగులో ఉద్యమం తీవ్రరూపం దాల్చడంతో బ్రిటిష్ ప్రభుత్వం విజయ్ సింగ్ పాథిక్‌ను అరెస్టు చేసి ఐదేళ్ల జైలు శిక్ష విధించింది.

భారత ప్రభుత్వం పోస్టల్ స్టాంపు విడుదల  1927లో జైలు నుండి విడుదలైన తర్వాత.. విజయ్ సింగ్ పతిక్ 1930లో ఒక వితంతు ఉపాధ్యాయుడిని వివాహం చేసుకున్నాడు. మళ్లీ బ్రిటిష్ వారు అరెస్ట్ చేశారు. ఒక రోజుల తర్వాత 1954లో మరణించాడు. భూప్ సింగ్ గౌరవార్థం భారత ప్రభుత్వం ఒక తపాలా స్టాంపును కూడా విడుదల చేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..