Watch: బాబోయ్.. ఆ ఐఐటీ క్యాంపస్‌లో దర్జాగా తిరుగుతున్న మొసలి.. స్టూడెంట్స్ పరుగో పరుగు..
క్యాంపస్‌లో మొసలిని చూసిన విద్యార్థులు అక్కడి నుంచి పరుగులు తీశారు. అయితే మొసలిని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో ఫుల్ ట్రెండ్ అయింది. ప్రస్తుతం అన్ని సోషల్ మీడియాలో ప్లాట్‌ఫామ్‌లలో వేగంగా వైరల్ అవుతోంది. ఇకనైనా ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చూడాలంటూ విద్యార్థులు, ఉపాధ్యాయులు, క్యాంపస్ సిబ్బంది అటవీ అధికారులకు విజ్క్షప్తి చేశారు.

ఎటు చూసినా విద్యార్థులతో ఎప్పుడూ రద్దీగా ఉండే ఆ ఐఐటీ క్యాంపస్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. క్యాంపస్ లోకి ప్రవేశించిన ఓ భారీ మొసలి అందరినీ హడలెత్తించింది. మొసలిని చూసి విద్యార్థులు, ఉపాధ్యాయులు భయాందోళనకు గురయ్యారు. క్యాంపస్‌లో మొసలిని చూసిన విద్యార్థులు అక్కడి నుంచి పరుగులు తీశారు. అయితే మొసలిని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో ఫుల్ ట్రెండ్ అయింది. ప్రస్తుతం అన్ని సోషల్ మీడియాలో ప్లాట్‌ఫామ్‌లలో వేగంగా వైరల్ అవుతోంది.
మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది. ప్రముఖ విద్యా సంస్థ అయిన ఐఐటీ బాంబే క్యాంపస్‌లో ఆదివారం రాత్రి వేళ భారీ మొసలి హల్‌చల్ చేసింది. మొసలి రోడ్డు పైకి పాకుతూ రావడాన్ని గమనించిన విద్యార్థులు భయపడిపోయారు. వెంటనే అక్కడి నుంచి పారపోయేందుకు పరుగులు తీశారు. వెంటనే స్పందించిన సెక్యూరిటీ సిబ్బంది అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ సిబ్బంది రంగంలోకి దిగారు. మొసలి స్థానికంగా ఉన్న పద్మావతి ఆలయంలోని సరస్సు నుంచి వచ్చినట్లుగా గుర్తించారు.
A crocodile drifted its way from Powai Lake into IIT situated Padmavati Devi temple today. Source: Powai COP Group, posted by a Powaiite. Further details awaited. pic.twitter.com/9eG6AiPxwD
— Planet Powai (@PlanetPowai) March 24, 2025
మార్చి 23, ఆదివారం సాయంత్రం 7 నుంచి 8 గంటల మధ్య ప్రాంతంలో ఈ సంఘటన జరిగినట్లుగా అటవీశాఖ సిబ్బంది పేర్కొన్నారు. అయితే, ఇలాంటి ఘటనలు ఇది మొదటి సారి కాదంటున్నారు స్థానికులు. గతంలోనూ పొవాయ్ సరస్సు నుంచి మొసళ్లు చాలాసార్లు క్యాంపస్‌లోకి ప్రవేశించి ఇక్కడి రోడ్లపై తిరిగాయని చెబుతున్నారు. ఇకనైనా ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చూడాలంటూ విద్యార్థులు, ఉపాధ్యాయులు, క్యాంపస్ సిబ్బంది అటవీ అధికారులకు విజ్క్షప్తి చేశారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..