Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బీచ్‌లో వాక్‌ చేస్తున్న జంటకు దూరంగా కనిపించిన వింత ఆకారం..! ఏంటి అని దగ్గరికెళ్లి చూడగా..

అయితే, వాటి ఉనికి వెనుక ఉన్న నిజం ఏమిటో ఎవరికీ తెలియదు. ప్రస్తుతం ఒక మత్స్యకన్యకు సంబంధించిన పోస్ట్‌ ఒకటి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇంగ్లాండ్‌లోని ఒక బీచ్‌లో ఒక జంట మత్స్యకన్య లాంటి అస్థిపంజరాన్ని గుర్తించారు. వారు దాని ఫోటోలను ఇంటర్నెట్‌లో షేర్‌ చేయటంతో అవి ఇప్పుడు సంచలనం సృష్టించాయి.

బీచ్‌లో వాక్‌ చేస్తున్న జంటకు దూరంగా కనిపించిన వింత ఆకారం..! ఏంటి అని దగ్గరికెళ్లి చూడగా..
Mermaid Like Skeletal
Follow us
Jyothi Gadda

|

Updated on: Mar 24, 2025 | 6:44 PM

ఈ ప్రపంచంలో ఎన్నో అద్బుత విషయాలు దాగి వున్నాయి. అనేక వింతలు, విచిత్రాలు, అంతుచిక్కని రహాస్యాలు ఉన్నాయి. అవి ఇప్పటికీ శాస్త్రవేత్తలకు సైతం పరిష్కారం కాని పజిల్‌గా మిగిలిపోయాయి. ఈ క్రమంలోనే గ్రహాంతరవాసులు, మత్స్యకన్యలు శతాబ్దాలుగా చర్చనీయాంశమైన రెండు ఆసక్తికరమైన అంశాలు. అయితే, వాటి ఉనికి వెనుక ఉన్న నిజం ఏమిటో ఎవరికీ తెలియదు. ప్రస్తుతం ఒక మత్స్యకన్యకు సంబంధించిన పోస్ట్‌ ఒకటి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇంగ్లాండ్‌లోని ఒక బీచ్‌లో ఒక జంట మత్స్యకన్య లాంటి అస్థిపంజరాన్ని గుర్తించారు. వారు దాని ఫోటోలను ఇంటర్నెట్‌లో షేర్‌ చేయటంతో అవి ఇప్పుడు సంచలనం సృష్టించాయి.

న్యూయార్క్ పోస్ట్‌లోని ఒక నివేదిక ప్రకారం,.. ఇంగ్లాండ్‌లోని ఒక జంట బీచ్‌లో నడుస్తున్నప్పుడు ఒక వింతైన, కలవరపెట్టే విషయాన్ని చూసి షాక్ అయ్యారు. మార్చి 10న పౌలా, డేవ్ రీగన్ కెంట్‌లోని మార్గేట్ బీచ్‌లో నడుస్తున్నప్పుడు మత్స్యకన్య లాంటి అస్థిపంజర బొమ్మను చూశారు. అక్కడ వారికి దొరికిన అస్థిపంజరం లాంటి బొమ్మ చెక్కతో తయారు చేయబడిందని, చేపలాంటి తోక, మొండెం, తల గ్రహాంతరవాసిని పోలిన జీవిగా ఉన్నాయి. అది ఏమిటో నేను మీకు చెప్పలేను, కానీ, అది చూసేందుకు మాత్రం చాలా ఎంతో వింతగా,విచిత్రంగా, ఒకింత భయం కలిగించేలా ఉందని పౌలా పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

ఆ వింత ఆకారం ఫోటోలు తీయకపోతే ఎవరూ మనల్ని నమ్మరని, అందుకే తాము ఆ విచిత్రాన్ని ఫోటోలు తీసినట్టుగా చెప్పారు. అయితే, ఈ ఆకారాన్ని ఎవరైనా సముద్రం మీదుగా తరలిస్తుండగా పడిపోయి ఉండవచ్చని భావిస్తున్నట్టుగా వారు చెప్పారు. ఈ క్రమంలోనే 19వ శతాబ్దంలో ఫిజీ మత్స్యకన్య ఉండేదని పుకార్లు వచ్చాయి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..