Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gongura: పుల్లని గోంగూరలో పుష్కలమైన పోషకాలు.. ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే..

పుంటి కూర‌.. దీన్నే గోంగూర అని కూడా అంటారు. దీంతో ప‌ప్పు, ప‌చ్చ‌డి, పులుసు వంటివి చేసి తింటారు. అలాగే, ఈ పుంటికూర కాంబినేషన్‌తో మటన్‌, చికెన్‌, చేపలు కూడా వండుతారు. ఇలాంటి వంటకాలంటే చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. ఈ పుంటి కూర వంటకం ఏదైనా సరే.. రుచి అద్దిరిపోయేలా ఉంటుంది. అంతేకాదు.. ఆరోగ్య పరంగా కూడా పుంటి కూర‌ పుష్కలమైన ప్రయోజనాలు కలిగి ఉంటుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. తరచూ పుంటికూర తినటం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

Jyothi Gadda

|

Updated on: Mar 24, 2025 | 6:10 PM

పుంటికూరలో అనేక పోష‌కాలు ఉంటాయి. ముఖ్యంగా ఐర‌న్ సమృద్ధిగా ఉంటుంది. క‌నుక ర‌క్త‌హీన‌త ఉన్న‌వారు పుంటి కూర‌ను తింటే ర‌క్త‌హీన‌త నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. హిమోగ్లోబిన్ శాతం కూడా పెరుగుతుంది. అంతేకాదు.. పుంటి కూర‌లో క్యాల్షియం, ఐర‌న్‌, విట‌మిన్ ఎ, సి, రైబోఫ్లేవిన్‌, ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉంటాయి. పుంటి కూర‌లో ఉండే క్యాల్షియం ఎముక‌ల‌ను బ‌లంగా మారుస్తుంది.

1 / 5
గోంగూరలో ఉండే విట‌మిన్ ఎ కంటి చూపును మెరుగు ప‌రుస్తుంది. దీంతో కంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. పుంటి కూర‌లో ఉండే ఫోలిక్ యాసిడ్ గ‌ర్భిణీల‌కు ఎంతో మేలు చేస్తుంది. ఈ కూర‌లో పీచు కూడా అధికంగానే ఉంటుంది. ఇది జీర్ణ స‌మ‌స్య‌ల‌ను త‌గ్గిస్తుంది. గ్యాస్‌, అసిడిటీ, క‌డుపు ఉబ్బ‌రం, మ‌ల‌బద్ద‌కం నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

2 / 5
గాయాలు, పుండ్ల‌ను త‌గ్గించ‌డంలోనూ పుంటి కూర ప‌నిచేస్తుంది. వాటిపైన ఈ ఆకుల‌ను ఆముదంతో వేడి చేసి క‌ట్టులా క‌డుతుంటే అవి త్వ‌ర‌గా మానుతాయి. గ‌డ్డ‌లు ఉంటే క‌రిగిపోతాయి. దీంతోపాటు నొప్పులు, వాపుల నుంచి కూడా ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

3 / 5
పుంటి కూర‌లో విట‌మిన్ ఎ అధికంగా ఉంటుంది. అందువ‌ల్ల ఈ కూర‌ను తర‌చూ తింటే రేచీక‌టి త‌గ్గుతుంది. క‌ళ్లు స్ప‌ష్టంగా క‌నిపిస్తాయి. దృష్టి దోషంతో బాధ‌ప‌డేవారు త‌ర‌చూ పుంటి కూర‌ను తింటే మేలు జ‌రుగుతుంది. అలాగే పుంటి కూర మొక్క పూల‌ను దంచి ర‌సం తీసి దాన్ని వ‌డ క‌ట్టి అందులో అర క‌ప్పు పాలు క‌లిపి ఉద‌యం, సాయంత్రం రెండు పూట‌లా సేవించాలి. దీంతో కూడా రేచీక‌టి స‌మ‌స్య త‌గ్గుతుంది. కంటి చూపు పెరుగుతుంది.

4 / 5
పుంటి కూర‌లో రెండు ర‌కాలు ఉంటాయి. ఒక‌టి తెల్ల‌ది కాగా మ‌రొక‌టి ఎర్ర‌ది. ఎర్ర‌ని పుంటి కూర‌ను మ‌నం త‌ర‌చూ వంట‌ల్లో వాడుతాం. తెల్ల‌ని పుంటి కూర‌తో నిల్వ ప‌చ్చ‌డి పెడుతుంటారు. ఇది టేస్ట్‌లో అదిరిపోతుంది. పుంటి కూర మలబద్ధకాన్ని, రేచీకటిని తొలగిస్తుంది. శ‌రీరంలో వేడి ఎక్కువగా ఉన్న‌వారు, వాతం చేసిన వారు పుంటి కూర‌ను తిన‌కూడ‌దు. దగ్గు ఆయాసం తుమ్ములతో బాధపడే వారికి చాలామేలు చేస్తుంది.

5 / 5
Follow us