Mirnalini Ravi: ఈ కాంత వంటి అందం ఆ జాబిల్లికైన ఉంటుందా.? గార్జియస్ మృణాళిని..
మృణాళిని రవి తమిళం, తెలుగు చిత్రాలలో నటించి కథానాయకిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. సినిమాల్లో ఆమె నటనతో ప్రేక్షకులను తనదైన శైలిలో ఆకట్టుకుంటుంది ఈ బ్యూటీ. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ తన సినిమా అప్డేట్స్, ఫొటోలతో అభిమానులను అలరిస్తుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా కొన్ని ఫోటోలను షేర్ చేరేసింది. చీరలో ఈ బ్యూటీని చుసిన కుర్రాళ్ల వావ్, సూపర్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం వాటిపై ఓ లుక్కేద్దాం రండి..
Updated on: Mar 24, 2025 | 6:39 PM

10 మే 1995న కేంద్రపాలిత ప్రాంతం అయినా పాండిచ్చేరిలో ఓ సాధారణ తమిళ కుటుంబంలో పుట్టి, పెరిగింది మృణాళిని రవి. అందంతో పాటు అభినయంతో ప్రేక్షకులను తనదైన నటనకి ఫిదా చేస్తుంది ఈ బ్యూటీ.

బెంగుళూరులోని ఈస్ట్ పాయింట్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుండి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్‌లో బ్యాచిలర్ డిగ్రీ పట్టభద్రురాలైంది. బెంగుళూరులోని IBMలో సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్‌గా పనిచేసింది. నటనపై ఆసక్తితో తన ఉద్యోగాన్ని విడిచిపెట్టింది.

తమిళం, తెలుగు భాషలలో సుపరిచితురాలు. డబ్స్మాష్ వీడియోలను అప్‌లోడ్ చేస్తూ సోషల్ మీడియాలో పేరు తెచ్చుకుంది. దర్శకుడు త్యాగరాజన్ కుమారరాజా ఆమె వీడియోలలో ఒకదాన్ని చూసి తనను ఆడిషన్ కోసం పిలిచి తన సినిమాలో ఎంపిక చేసారు.

ఆలా 2019లో సూపర్ డీలక్స్ అనే ఓ తమిళ చిత్రంలో ఏలియన్ అమ్మాయిగా సినీ అరంగేట్రం చేసింది ఈ వయ్యారి భామ. తర్వాత అదే ఏడాది వరుణ్ తేజ్ గద్దలకొండ గణేష్ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించి తెలుగు తెరకు పరిచయం అయింది.

2023లో సయ్యద్ సోహెల్ కి జోడిగా ఆర్గానిక్ మామా హైబ్రిడ్ అల్లుడు, సుధీర్ బాబుకి జంటగా మామా మశ్చేంద్ర చిత్రాల్లో కనిపించింది. ఇటీవల తమిళ రొమాంటిక్ కామెడీ డ్రామా చిత్రం రోమియో సినిమాతో ఆకట్టుకుంది ఈ అందాల తార.





























