ప్రతి రోజూ బొప్పాయి తింటున్నారా..? దీనిని ఎవరు తినకూడదో తెలుసా..?
బొప్పాయి ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచి, చర్మాన్ని అందంగా ఉంచుతుంది. గుండె ఆరోగ్యానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. కానీ ఎక్కువగా తీసుకుంటే కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఇప్పుడు బొప్పాయి తీసుకోవడం వల్ల కలిగే లాభాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం.

బొప్పాయి ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమైన పండు. ఇందులో అనేక పోషకాలు ఉండటంతో జీర్ణక్రియ మెరుగుపడుతుంది. గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. చర్మ సమస్యలు తగ్గుతాయి. అయితే బొప్పాయిని పరిమితమైన మోతాదులోనే తీసుకోవాలి. ఒకవేళ ఎక్కువగా తీసుకుంటే కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.
బొప్పాయిలో పాపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది శక్తివంతమైన అలెర్జీ కారకం. కొంతమందికి ఎక్కువ మోతాదులో బొప్పాయి తినడం వల్ల అలెర్జీ లక్షణాలు కనిపించవచ్చు. ఎక్కువ పాపైన్ తీసుకోవడం వల్ల చర్మంపై దద్దుర్లు, నోటి గందరగోళం, వాంతులు వంటి సమస్యలు తలెత్తవచ్చు. కాబట్టి అలెర్జీకి గురయ్యే అవకాశమున్నవారు ఎక్కువగా బొప్పాయి తినకపోవడం మంచిది.
బొప్పాయిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు చాలా సహాయపడుతుంది. అయితే ఎక్కువ మోతాదులో ఫైబర్ తీసుకుంటే రక్తంలో నీటి శాతం తగ్గిపోవడం వల్ల విరేచనాలు, డీహైడ్రేషన్ వంటి సమస్యలు రావచ్చు. జీర్ణక్రియ సరిగా లేకపోవడం వల్ల మలబద్ధకం కూడా ఎదురవుతుంది. అందువల్ల ఫైబర్‌ను సమతుల్యంగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది.
గర్భిణీ స్త్రీలు పండని లేదా సగం పండిన బొప్పాయిని తినకూడదు. బొప్పాయిలోని పాపైన్ గర్భిణీ స్త్రీల శరీరంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. ఇది కడుపులోని బిడ్డకు హాని కలిగించే ప్రమాదం ఉంది. కాబట్టి గర్భిణీ స్త్రీలు పూర్తిగా పండిన బొప్పాయినే తినాలి లేదా డాక్టర్ సలహా తీసుకుని తీసుకోవడం మంచిది.
కడుపు సమస్యలతో బాధపడేవారు బొప్పాయిని తరచూ తినకపోవడమే మంచిది. బొప్పాయిలోని ఫైబర్ అధికంగా ఉండడం వల్ల కడుపు సమస్యలను పెంచే అవకాశాలు ఉంటాయి. కడుపులో మంట లేదా ఇతర సమస్యలు ఉన్నవారు బొప్పాయిని పరిమితంగా తీసుకోవాలి.
మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నవారు, అలెర్జీ ఉన్నవారు బొప్పాయి తినడానికి ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది. బొప్పాయిలో ఉండే కొన్ని రసాయనాలు ఈ సమస్యలను తీవ్రతరం చేసే ప్రమాదం ఉంది. అందువల్ల ఈ పరిస్థితుల్లో ఉన్నవారు బొప్పాయి తినేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)