బెండకాయలతో నీళ్లను తయారు చేసి తాగుతారని తెలుసా? బరువు తగ్గాలనుకునే వారు బెండకాయ నీటిని తాగితే చాలా ప్రయోజనాలు ఉన్నాయి. పోషకాహార నిపుణులు ఈ విషయాన్నే చెబుతున్నారు.
బెండకాయలలో ఫైబర్‌తోపాటు మెండుగా యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ అధికంగా ఉంటాయి. బెండకాయలోని ఈ పోషకాలు బరువు తగ్గేందుకు సహాయపడతాయి.
బెండకాయలు చక్కెర స్థాయిని తగ్గించడంలోనూ అద్భుతంగా పనిచేస్తాయి. డయాబెటిస్‌ను నియంత్రణలో ఉంచుతాయి. బెండకాయలను తింటే శరీరంలోని మెటబాలిజం పెరుగుతుంది.
వంద గ్రాముల బెండకాయలను తింటే దాదాపుగా 33 క్యాలరీల శక్తి లభిస్తుంది. బరువు తగ్గాలనుకునే వారు తప్పనిసరిగా బెండకాయలను తినాలి. బెండకాయల్లో సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది.
ఇది కడుపు నిండిన భావనను కలగజేస్తుంది. దీనివలన ఆకలి త్వరగా అనిపించదు. దీంతో ఆహారం మితంగా తీసుకుంటారు. ఇది బరువు తగ్గుదలకు దోహదం చేస్తుంది.
బెండకాయల నీళ్లను తాగడం వల్ల బరువు తగ్గుదలకు దోహదం చేస్తుంది. బెండకాయ నీటిలో ఉండే జిగురు వంటి పదార్థం కడుపు నిండుగా అనిపిస్తుంది. దీంతో ఆకలి వేయదు. అతిగా తినకుండా ఉంటారు.
బెండకాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు, పాలిఫినాల్స్ అధికంగా ఉంటాయి. ఇవి మెటబాలిజాన్ని మెరుగుపరుస్తాయి. మెటబాలిజం మెరుగుపడితే శరీరంలో క్యాలరీలు సులభంగా ఖర్చవుతాయి.
దీంతో కొవ్వు కొవ్వొత్తిలా కరుగుతుంది. దీనివలన బరువు అమితంగా తగ్గుతారు. బెండకాయలను తింటే జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు తగ్గిపోతాయి.