జొన్నల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల కొద్దిగా తినగానే కడుపు నిండినట్లుగా ఉంటుంది. దీంతో ఎక్కువగా తినరు. కడుపు కూడా నిండుగా ఉన్నట్లుగా ఉంటుంది.
కేలరీలు తక్కువగా తీసుకుంటారు. దీంతో త్వరగా బరువు తగ్గుతారు. పైగా ఈ జొన్నలు గ్లూటెన్ ఫ్రీ, కేలరీలు తక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునేవారు వీటిని హ్యాపీగా తీసుకోవచ్చు.
జొన్నల్లో తగినంత మెగ్నీషియం ఉంటుంది. ఇది కాల్షియం శోషణని పెంచేందుకు తోడ్పడుతుంది. ఎముకల ఆరోగ్యాన్ని పెంచుతుంది. విరిగిన, వయసు పెరగడం వల్ల వచ్చే బోన్ ప్రాబ్లమ్స్‌ని తగ్గిస్తుంది.
రెగ్యులర్‌గా జొన్నల్ని తింటే ఆస్టియోపోరోసిస్, ఆర్థరైటిస్ ప్రమాదం తగ్గుతుంది. జొన్నల్లో నియాసిన్, విటమిన్ బి3లు ఎక్కువగా ఉంటాయి. డైట్‌లో జొన్నల్ని చేర్చితే జీవక్రియ పెరుగుతుంది.
నియాసిన్ అనేది బాడీలోని శక్తి జీవక్రియలో కీలకమైన భాగం. అంతేకాకుండా, రోజంతా ఎనర్జీగా ఉంటారు. జొన్నగట్కాలో ఫైబర్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి.
జొన్నల్లో లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. టానిన్ ఎక్కువగా ఉండే జొన్న ఊక బాడీలో చక్కెర, పిండి పదార్థాల శోషణని తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉన్న ఎంజైమ్స్‌ని స్రవిస్తుంది.
జొన్న శరీరంలో గ్లూకోజ్ స్థాయిలను కంట్రోల్, ఇన్సులిన్ రెస్టిస్టెన్స్‌ని కంట్రోల్ చేస్తుంది. వీటితో పాటు ఇందులో ఫైబర్, థయామిన్, నియాసిన్, రిబోఫ్లేవిన్, ఫోలేట్ ఎక్కువగా ఉంటుంది.
జొన్నల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా డైటరీ ఫైబర్ దీనిని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలైన బ్లోటింగ్, అజీర్ణం, మలబద్ధకం, ఇతర సమస్యలన్నీ కూడా తగ్గుతాయి.