ఈ పువ్వు ఆడ, మగ ఇద్దరికీ వరం..ఎన్నో వ్యాధులకు దివ్యౌషధం..!

Jyothi Gadda

07 March 2025

స్టార్ పువ్వు రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల పుష్కల పోషకాలు ఉంటాయి. శరీరానికి మేలు చేస్తాయి. స్టార్ అనైజ్‌ డైట్‌లో చేర్చుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం.. 

స్టార్‌ అనైజ్‌లో ఔషధ గుణాలు పుష్కలం. ఇది కడుపులో అజీర్తి, గ్యాస్ తొలగిస్తుంది. స్టార్‌ అనైజ్‌లో కార్మినేటివ్ లక్షణాలు కడుపులో ఆరోగ్యకరమైన బ్యాక్టిరియా పెరుగుదలకు తోడ్పడుతుంది. 

ఇందులో యాంటీ వైరల్ గుణాలు ఉంటాయి. అంటే ఇది ముఖ్యంగా జలుబు, రొంప సమస్యలకు మంచి ఔషధం అని చెప్పాలి. దీంతో సహజసిద్ధంగా ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తుంది.

ఇది యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కూడా కలిగి ఉంటుంది. హానికర కిరణాల నుంచి మనల్ని కాపాడుతుంది. ఇందులో ఉండే విటమిన్ ఇ ఇన్ఫెక్షన్‌లను దూరం చేస్తుంది.

రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఇది ముక్కు శ్వాస నాళాలను క్లియర్ చేస్తుంది. ముఖ్యంగా జలుబు దగ్గుతో బాధపడే వారు స్టార్ అనైజ్ హెర్బల్ టీ తక్షణ రెమిడీగా పనిచేస్తుంది.

స్టార్ అనైజ్‌ షుగర్ వ్యాధిగ్రస్తులకు కూడా మంచిది. రక్తంలో చక్కెర స్థాయిలను హఠాత్తుగా పెరగనివ్వకుండా కాపాడుతుంది. షుగర్‌ బాధితుల్లో మెటబాలిజం రేటు పెంచుతుంది.

స్టార్ అనైజ్ మన డైట్‌లో చేర్చుకోవడం వల్ల గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ముఖ్యంగా ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేషన్‌ సమస్య నుంచి కాపాడతాయి. 

ఈ స్టార్ అనైజ్ టీ తీసుకోవడం వల్ల చర్మం కూడా ఆరోగ్యంగా కనిపిస్తుంది. ఇందులో యాంటీ మైక్రోబ్రియల్‌ గుణాలు చర్మ ఆరోగ్యానికి ఎంతో మంచిది. ముఖంపై యాక్నేను నివారిస్తుంది.