ముఖం మెరిసేందుకు రోజ్ వాటర్‌ను రాత్రిపూట ఇలా వాడి చూడండి..!

Jyothi Gadda

25  February 2025

ఈ వేసవిలో మీ చర్మం బాగుండాలంటే.. మీ చర్మాన్ని క్రమం తప్పకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. చర్మానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా చర్మ కణాలు ఆరోగ్యంగా ఉంటాయి. 

రోజూ రాత్రిపూట రోజ్ వాటర్ తో కొన్ని ఫేస్ ప్యాక్ లను ముఖానికి వేసుకుంటే ఎండ వల్ల చర్మం నల్లబడకుండా ఉంటుంది. చర్మంలోని మురికి పూర్తిగా తొలగిపోతుంది. 

రాత్రి పడుకునే ముందు రోజ్ వాటర్ మీ ముఖానికి అప్లై చేస్తే కాంతి పెరుగుతుంది. మారుతున్న వాతావరణంలో ప్రకాశవంతమైన చర్మాన్ని కాపాడుకోవడం ఒక సవాలు.

చర్మ సమస్యలకు చికిత్స చేయడానికి ప్రజలు రోజ్ వాటర్‌ను ఉపయోగిస్తారు. అయితే, దీన్ని విటమిన్ ఇ క్యాప్సూల్‌తో కలిపి తీసుకోవడం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.

విటమిన్ E క్యాప్సూల్స్ వాడటం వల్ల పిగ్మెంటేషన్ వదిలించుకోవడానికి సహాయపడుతుంది. విటమిన్ E, రోజ్ వాటర్ అప్లై చేయడం వల్ల పొడి చర్మ సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు.

విటమిన్ ఇ క్యాప్సూల్స్, రోజ్ వాటర్ అప్లై చేయడం వల్ల ముఖం కాంతి పెరుగుతుంది. ఒక గిన్నెలో విటమిన్ E క్యాప్సూల్, రోజ్ వాటర్ తీసుకొని బాగా కలపండి.

ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి అప్లై చేసి, బాగా మసాజ్ చేసి, రాత్రంతా అలాగే ఉంచండి. దీన్ని క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల ముఖం రంగు మెరుగుపడుతుంది.

రోజ్ వాటర్‌లో యాంటీ సెప్టిక్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. చర్మ రంధ్రాలను బిగించి, మొటిమలను తగ్గించి, మృదువుగా చేస్తుంది. తలనొప్పి, మైగ్రేన్ సమస్యలను పరిష్కరిస్తుంది.