ఆపిల్ తిని నీళ్లు తాగితే ఏమౌతుందో తెలుసా..?

Jyothi Gadda

11 February 2025

యాపిల్‌ ఆరోగ్యానికి అనేక ప్రయోజనాల్ని అందిస్తుంది. రోజూ ఒక యాపిల్ తింటే చాలా రోగాలను దూరం చేసుకోవచ్చు. కానీ,యాపిల్‌ తిన్న వెంటనే నీళ్లు తాగకూడదట మీకు తెలుసా? 

మన జీర్ణకోశంలో సాధారణ pH స్థాయి క్షార గుణం కలిగి ఉంటుంది. యాపిల్‌ తిన్న వెంటనే నీళ్ళు తాగితే, అది pH స్థాయిని దెబ్బతిస్తుంది. నీరు pH స్థాయిని తగ్గిస్తుంది. 

పండ్లలో సహజంగా చక్కెర, ఈస్ట్ ఎక్కువగా ఉంటాయి. పండు తిన్న వెంటనే నీళ్ళు తాగితే, అది జీర్ణకోశంలో ఆమ్లాన్ని నీరుగా మారుస్తుంది. దీనివల్ల ఈస్ట్ పెరుగుతుంది. 

కార్బన్ డయాక్సైడ్, ఆల్కహాల్ ఉత్పత్తి అయ్యి, గ్యాస్ పెరుగుతుంది. జీర్ణక్రియ దెబ్బతింటుంది. దీంతో ఆరోగ్యపరంగా అనేక దుష్ప్రభావాలను కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. 

యాపిల్ తిన్న వెంటనే నీళ్లు తాగటం వల్ల గుండెల్లో మంట, ఆమ్లత పెరుగుతాయి. జీర్ణక్రియ దెబ్బతిని, జీర్ణం కాని ఆహారం కొవ్వుగా మారుతుంది. అలాగే, కడుపు నొప్పి, అజీర్తి వస్తాయి.

 యాపిల్ తిన్న వెంటనే నీళ్లు తాగటం వల్ల శరీరంలో ఇన్సులిన్ స్థాయి పెరిగి, రక్తంలో చక్కెర పెరుగుతుంది. అలాగే, వాంతులు, విరేచనాలు, వికారం, మలబద్ధకం వస్తాయి.

నిపుణుల ప్రకారం,యాపిల్ తిన్నాక ఒక గంట తర్వాత నీళ్ళు తాగాలి. ఏ పండు తిన్నా కూడా ఇదే నియమం వర్తిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.

నిపుణుల ప్రకారం,యాపిల్ తిన్నాక ఒక గంట తర్వాత నీళ్ళు తాగాలి. ఏ పండు తిన్నా కూడా ఇదే నియమం వర్తిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.