శుంఖుపుష్పాన్ని అపరాజిత, గిరికర్ణిక, దింటెన అనే పేర్లతోనూ పిలుస్తుంటారు. ఈ పుష్పాన్ని పూజలో ఎంత ప్రవిత్రంగా భావిస్తారో ఆయుర్వేదంలోనూ అంతే ప్రత్యేకంగా చూస్తారు.
ఆయుర్వేద వైద్యంలో ఎన్నో అనారోగ్యాల చికిత్సకు శంఖుపుష్పాన్ని వాడుతూ ఉంటారు. శంఖుపుష్పాల టీని తరచుగా తీసుకుంటే..అనేక లాభాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
బ్లూ టీని ఎండిన శంఖుపుష్పాలతో తయారు చేస్తారు. ఈ టీ నీలం రంగులో ప్రత్యేకంగా ఉంటుంది. ఇందులో ఆంథోసైనిన్ సమృద్ధిగా ఉండటం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి.
బ్లూ టీ లో ఫినోలిక్ యాసిడ్, ఫినాలిక్ అమైడ్ యాంటీ ఆక్సిడెంట్ గుణాలు మెండుగా ఉంటాయి. ప్రతిరోజూ ఈ టీ తాగితే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
బ్లూ టీ తాగడం వల్ల వాంతులు, వికారం నుంచి ఉపశమనం పొందవచ్చు. షుగర్ పేషెంట్స్ రెగ్యులర్ టీ కాకుండా బ్లూ తాగితే మంచిదని డాక్టర్లు సూచిస్తున్నారు.
బ్లూ టీలో ఉంటే యాంటీ గ్లైసటీన్ ప్రాపర్టీస్ వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ముడతలు రాకుండా యవ్వనంగా కనిపిస్తారు. బ్లూ టీలోని ఆంథోసైనిన్ కారణంగా జుట్టు రాలడం తగ్గుతుంది.
మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది. ఇది క్రమంగా, అథెరోస్క్లెరోసిస్, హార్ట్ ఎటాక్, ధమనులలో రక్తం గడ్డకట్టడం, హైపర్‌టెన్షన్ వంటి తీవ్ర అనారోగ్యాల నుంచి రక్షిస్తుంది.
ఈ టీలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ, అనాల్జేసిక్ లక్షణాలు కంటి ఇన్ఫెక్షన్లు, ఎరుపు, వాపు వంటి సమస్యలను తగ్గిస్తాయి. ఈ టీ రోజూ తగితే.. దృష్టి, కంటి సమస్యల నుంచి రక్షణ లభిస్తుంది.