హిమోఫిలియా వంటి రక్తస్రావం వంటి సమస్యలున్న వారు తీసుకోకూడదు. లవంగాలు సన్నబడే ప్రభావాన్ని కలిగి ఉంటాయి. దెబ్బ తగిలితే ఎక్కువ రక్తస్రావం అయ్యే అవకాశం ఉంది.
గర్భిణీలు, పాలిచ్చే స్త్రీలు లవంగాన్ని ఎక్కువగా తినకూడదు. అలాగే, లవంగాలు ఎక్కువగా తినడం వల్ల శరీరంలో వేడి పెరుగుతుంది. చర్మం దెబ్బతింటుంది, మొటిమలకు దారితీస్తుంది.
లవంగాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల గొంతు, ఛాతీ లేదా పొట్టలో మంట కూడా వస్తుంది. లవంగాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల పేగులు దెబ్బతింటాయి.
లవంగాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తం పలుచగా మారుతుంది. దీని అధిక వినియోగం వల్ల అలర్జీకి దారితీసే అవకాశం కూడా లేకపోలేదు.
లవంగాలను పెద్ద మొత్తంలో తీసుకోవడం వల్ల పురుషులలో టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గుతుంది. లవంగాలను ఎక్కువగా వాడటం వల్ల కంటి సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది.
లవంగాలను అతిగా వాడటం వల్ల కిడ్నీ, లివర్ సమస్యలు వస్తాయి. వాటిని ఎక్కువగా తినడం వల్ల శరీరంలో ఉష్ణం ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దీని వల్ల కిడ్నీ, లివర్ సమస్యలు వస్తాయి.
లవంగాలు తీసుకోవడం వల్ల శరీరంలో గ్లూకోజ్ స్థాయి తగ్గుతుంది. ఇప్పటికే గ్లూకోజ్ తక్కువగా ఉన్నవారు లవంగాలను తినకపోవడమే మంచిది.
లవంగాలు తినడం గర్భిణీ స్త్రీలకు హాని కలిగించవచ్చు. లవంగాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల మూత్రపిండాలు, కాలేయం, కడుపు సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.