ఇదేదో గడ్డిమొక్క కాదు..ఆయుర్వేద ఔషధ గని

ఇదేదో గడ్డిమొక్క కాదు..ఆయుర్వేద ఔషధ గని

Jyothi Gadda

30 January 2025

గడ్డి చామంతి ఆకులను ఎన్నో ఆయుర్వేద మందుల తయారీలో ఉపయోగిస్తుంటారు. ఈ ఆకుల్లో యాంటీ కార్సినోజెనిక్‌ ఉంటుంది. ఇది డయాబెటిస్‌ను కంట్రోల్‌ చేస్తుంది.

TV9 Telugu

గడ్డి చామంతి ఆకులను ఎన్నో ఆయుర్వేద మందుల తయారీలో ఉపయోగిస్తుంటారు. ఈ ఆకుల్లో యాంటీ కార్సినోజెనిక్‌ ఉంటుంది. ఇది డయాబెటిస్‌ను కంట్రోల్‌ చేస్తుంది.

ఈ ఆకులను నమిలి తినడం ద్వారా డయాబెటిక్ లెవెల్స్ కంట్రోల్ లోకి వస్తాయి. జుట్టు సమస్యలు, ఫంగల్ ఇన్ఫెక్షన్లకు ఈ ఆకులను వాడితే ఫలితం ఉంటుంది.

TV9 Telugu

ఈ ఆకులను నమిలి తినడం ద్వారా డయాబెటిక్ లెవెల్స్ కంట్రోల్ లోకి వస్తాయి. జుట్టు సమస్యలు, ఫంగల్ ఇన్ఫెక్షన్లకు ఈ ఆకులను వాడితే ఫలితం ఉంటుంది.

ఈ ఆకుల్లో యాంటీ ఇన్‌ప్టమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జలుబు, దగ్గు , గొంతు గరగర వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

TV9 Telugu

ఈ ఆకుల్లో యాంటీ ఇన్‌ప్టమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జలుబు, దగ్గు , గొంతు గరగర వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

TV9 Telugu

ఇక జుట్టు ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా గడ్డి చామంతి ఆకులు ఉపయోగపడతాయి. ఆకులను మెత్తగా పేస్టులా చేసుకోవాలి. అనంతరం ఆ పేస్టును ఆవనూనెలో కలిపి నూనెను మరిగించాలి.

TV9 Telugu

ఈ నూనెను వడకట్టి ఒక బాటిల్‌లోకి తీసుకోవాలి. ఈ నూనెను తలకు అప్లై చేసుకోవాలి. ఇలా చేస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. జుట్టు నల్లగా మారుతుంది. చుండ్రు సమస్య ఇట్టే తగ్గిపోతుంది.

TV9 Telugu

శ్వాస సంబంధిత సమస్యలను కూడా దూరం చేస్తుంది. అలాగే లివర్ ఆరోగ్యం మెరుగవుతుంది. ఆకులను కషాయం రూపంలో చేసుకొని తాగితే ఇలాంటి సమస్యలు తగ్గిపోతాయి.

TV9 Telugu

గడ్డి చామంతి మొక్కలో యాంటీ కోగ్యులెంట్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. ఈ ఆకు రసం చర్మ అంటు వ్యాధులున్న వారికి మంచి ఔషధంగా పనిచేస్తుంది.

TV9 Telugu

ఈ చామంతి ఆకులకు తెల్లని వెంట్రుకలను నల్లగా మార్చే శక్తి ఉంది. గడ్డి చామంతి ఎండిన ఆకులతో పొగ వేస్తే క్రిమి కీటకాలు, దోమలు, ఈగలు వంటివి ఇంట్లోకి రాకుండా ఉంటాయి.

TV9 Telugu