తాటికల్లా తమాషానా.. ఎండాకాలంలో తాగితే ఏమౌతుంది..?

Jyothi Gadda

04 March 2025

తాటి చెట్టు నుంచి ఉదయాన్నే ఈ కల్లు తీస్తారు. దీనిని.. తెలంగాణలో చిన్నా, పెద్దా, ఆడ, మగ తేడా లేకుండా తాగుతూ ఉంటారు. దీనిని ఆల్కహాల్ కింద పరిగణించలేం. 

తాటి చెట్టు కొన నుండి వచ్చే నీటిని సున్నం పూసిన కుండలో నిల్వ చేస్తారు. ఈ విధంగా నిల్వ చేసిన నీటి అడుగున సున్నం స్థిరపడుతుంది. పైభాగంలో ఉన్న స్వచ్ఛమైన నీటిని తాగుతుంటారు.

సహజంగా లభించే ఈ నీటిలో విటమిన్ సి, విటమిన్ బి, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఇనుము, ఫైబర్, జింక్ , భాస్వరం వంటి శరీరానికి అవసరమైన పోషకాలు ఉంటాయి.

తాటి కల్లు లోని విటమిన్ సి శరీరంలో రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. ఇది వేసవిలో తట్టు,కామెర్లు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. 

కల్లులోని పొటాషియం వంటి ఎలక్ట్రోలైట్లు శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. ఇందులోని సహజ చక్కెరలు మీకు త్వరిత శక్తిని ఇస్తాయి. వేసవిలో మిమ్మల్ని తాజాగా ఉంచుతాయి.

ఇందులోని విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు కణాలలోని ఫ్రీ రాడికల్స్‌ను తొలగించి చర్మంలో కొల్లాజెన్ ఏర్పడటాన్ని ప్రోత్సహిస్తాయి. వేసవిలో కూడా మీ చర్మాన్ని సురక్షితంగా ఉంచుతుంది. 

తాటికల్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. డయేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులకు కారణం అయ్యే వైరస్‌కు తాటికల్లు యాంటిబయాటిక్‌గా పనిచేస్తుంది.

ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తుంది.  నీటిలోని కాల్షియం,  మెగ్నీషియం వంటి ఖనిజాలు ఎముకలను బలోపేతం చేస్తాయి. ఆస్టియోపోరోసిస్. ఎముక సంబంధిత వ్యాధులను నివారిస్తాయి.