ఖాళీ కడుపుతో రెండు లవంగాలు తింటే ఇన్ని లాభాలా..?

ఖాళీ కడుపుతో రెండు లవంగాలు తింటే ఇన్ని లాభాలా..? 

Jyothi Gadda

22 March 2025

లవంగాలతో పుష్కలమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్న మాట. రెగ్యులర్‌గా వంటల్లో లవంగాలను ఉపయోగించడం వల్ల కలిగే లాభాలేంటంటే..

లవంగాలతో పుష్కలమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్న మాట. రెగ్యులర్‌గా వంటల్లో లవంగాలను ఉపయోగించడం వల్ల కలిగే లాభాలేంటంటే..

రక్తంలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉంచుకోవడానికి లవంగాలు అద్భుతంగా పనిచేస్తాయి. లవంగాల్లో ఉండే అద్భుతమైన గుణాలు షుగర్ కంట్రోల్ చేసి డయాబెటిస్ ముప్పును తగ్గిస్తాయి.

రక్తంలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉంచుకోవడానికి లవంగాలు అద్భుతంగా పనిచేస్తాయి. లవంగాల్లో ఉండే అద్భుతమైన గుణాలు షుగర్ కంట్రోల్ చేసి డయాబెటిస్ ముప్పును తగ్గిస్తాయి.

లవంగాల్లో ఉండే బీటా కెరోటిన్ విటమిన్ ఎ కింద మారుతుంది. ఇది కంటి ఆరోగ్యానికి ఎంతగానో సహాయం చేస్తుంది. అలాగే ఫ్యాటీ లివర్ సమస్య కూడా తగ్గుతుంది.

లవంగాల్లో ఉండే బీటా కెరోటిన్ విటమిన్ ఎ కింద మారుతుంది. ఇది కంటి ఆరోగ్యానికి ఎంతగానో సహాయం చేస్తుంది. అలాగే ఫ్యాటీ లివర్ సమస్య కూడా తగ్గుతుంది.

లవంగాల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఆక్సిడేటివ్ ఒత్తిడి నుంచి చర్మాన్ని కాపాడుతాయి. తద్వారా ముడతలు, మచ్చలు వంటి సమస్యలు రాకుండా కాపాడుతాయి.

నోటి ఆరోగ్యానికి లవంగాలు అద్భుతంగా పనిచేస్తాయి. లవంగాల్లో ఉండే యాంటీ సెప్టిక్ గుణాలు నోట్లో ఉండే హానికరమైన బ్యాక్టీరియాని తొలగించి, నోటి దుర్వాసనను దూరం చేస్తుంది. 

పంటి నొప్పితో బాధపడేవారు లవంగాలను పంటి నొప్పి ఉన్న చోట పెడితే సులువుగా నొప్పి తగ్గుతుంది. చిగుళ్ల వాపుని కూడా ఇది దూరం చేస్తుంది. దంతాలని ఆరోగ్యంగా చూస్తుంది.

లవంగాల్లో యాంటీ మైక్రోబియల్ గుణాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి చర్మంపై దురద, ర్యాషెస్ వంటి ఇన్ఫెక్షన్లు రాకుండా నివారిస్తాయి.

మెరిసే చర్మం కోసం కూడా లవంగాల నూనెను ఉపయోగించవచ్చు. చాలా తక్కువ మొత్తంలో ఈ నూనెను చర్మానికి రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.