వాట్సాప్ స్టేటస్ విషయమై భార్యతో గొడవ.. ఆమె కళ్ల ముందే రైలుకు ఎదురుగా దూకి..!
పోలీసులు చెప్పిన వివరాల మేరకు వాట్సాప్ స్టేటస్ విషయమై దిల్‌రాజ్ మీనా దంపతుల మధ్య వాగ్వాదం గొడవకు దారితీసింది. ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో తాను రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంటానంటూ దిల్‌రాజ్ ఇంట్లోంచి పరుగులు తీశాడు. దాంతో అతడి భార్య కూడా దిల్‌రాజ్ వెంటే పరుగెత్తుకుంటూ వెళ్లింది. రైల్వే ట్రాక్ వెంట

భార్యతో గొడవపడ్డ ఓ వ్యక్తి క్షణికావేశంలో ప్రాణాలు తీసుకున్నాడు. తన భార్య కళ్లముందే కదులుతున్న రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద సంఘటన రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్ జిల్లాలో చోటు చేసుకుంది. దిల్‌రాజ్ మీనా అనే 23 ఏళ్ల యువకుడు ఏడాది క్రితం వివాహం చేసుకున్నాడు. భార్యాభర్త ఇద్దరూ కోటాలోని బాలాజీకి బాగ్చీ ఏరియాలో ఉంటూ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారు. ఇదిలా ఉండగా, ఆదివారం నాడు దంపతుల మధ్య ఏదో విషయంపై గొడవ జరిగింది. ఆ తర్వాత దిల్‌రాజ్ ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తూ గది నుంచి బయటకు వెళ్లాడు.
పోలీసులు చెప్పిన వివరాల మేరకు వాట్సాప్ స్టేటస్ విషయమై దిల్‌రాజ్ మీనా దంపతుల మధ్య వాగ్వాదం గొడవకు దారితీసింది. ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో తాను రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంటానంటూ దిల్‌రాజ్ ఇంట్లోంచి పరుగులు తీశాడు. దాంతో అతడి భార్య కూడా దిల్‌రాజ్ వెంటే పరుగెత్తుకుంటూ వెళ్లింది. రైల్వే ట్రాక్ వెంట పరుగెడుతున్న భర్తను వారిస్తూ, వద్దూవద్దూ అని గట్టిగా అరుస్తూ అతడిని అనుసరించింది. ఇంతలో ఎదురుగా రైలు రావడంతో ఆమెకు కొన్ని మీటర్ల దూరంలో ఆ రైలు కింద దూకి దిల్‌రాజ్ ఆత్మహత్య చేసుకున్నాడు.
దిల్‌రాజ్ మీనా మృతదేహాన్ని పోస్ట్‌మార్టం అనంతరం అతడి కుటుంబానికి అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ విషయంలో తదుపరి దర్యాప్తు జరుగుతోందని చెప్పారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..