Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Azadi ka Amrit Mahotsav: బ్రిటీష్ పాలకుల నుంచి తన రాష్ట్ర విముక్తి కోసం యుద్ధం చేసిన బేగం హజ్రత్ మహల్ గురించి మీకు తెలుసా..

దేశం కోసం పోరాడిన ఎందరో వీరులు చరిత్ర మాటున దాగి ఉన్నారు.. అలాంటి వీరుల త్యాగాలను భావితరాలకు అందించడానికి టీవీ9 ప్రయత్నిస్తోంది.

Azadi ka Amrit Mahotsav: బ్రిటీష్ పాలకుల నుంచి తన రాష్ట్ర విముక్తి కోసం యుద్ధం చేసిన బేగం హజ్రత్ మహల్ గురించి మీకు తెలుసా..
Begum Hazrat Mahal
Follow us
Surya Kala

| Edited By: Anil kumar poka

Updated on: Aug 02, 2022 | 7:03 PM

Azadi ka Amrit Mahotsav: 1857  క్విట్ ఇండియా ఉద్యమంలో భారతీయులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ఉద్యమంలో పాల్గొన్న అనేక మంది   దేశం కోసం తమ ప్రాణాలను అర్పించారు. కొందరు తమ అవయవాలను సైతం కోల్పోయారు. అయితే ఈ క్విట్ ఇండియా ఉద్యమంలో పురుషులు మాత్రమే కాదు.. అనేక మంది మహిళలు తమ మద్దతు పలికారు. ఉద్యమంలో పాల్గొన్న మహిళలు బ్రిటీష్ వారి నుంచి అనేక సమస్యలను ఎదుర్కొన్నారు. అలా ఉద్యమంలో పాల్గొన్న మహిళల్లోఒకరు బేగం హజ్రత్ మహల్, తన ధైర్యసాహసాలతో అవధ్‌ను బ్రిటిష్ పాలకుల నుంచి విముక్తి  కోసం పోరాటం చేసి .. బేగం హజ్రత్ మహల్ అభినవ ‘లక్ష్మీబాయి’గా కీర్తించారు.

బ్రిటిష్ వారికి బందీగా నవాబ్ వాజిద్ అలీ 

అవధ్ ను నవాబ్ వాజిద్ అలీ షా పాలించేవారు. అవధ్ చాలా పెద్ద , సంపన్నమైన రాచరిక రాష్ట్రం. దీంతో ఈ రాష్ట్రంపై బ్రిటిష్ పాలకుల కన్ను పడింది. ఈస్ట్ ఇండియా కంపెనీ 1856లో దాడి చేసింది. బ్రిటిష్ వారు దాడి చేసి నవాబ్ వాజిద్ అలీ షా బంధించారు. అతడిని కోల్‌కతా జైలుకు తరలించారు. బేగం హజ్రత్ మెహల్ నవాబ్ వాజిద్ అలీ రెండవ భార్య బేగం హజ్రత్ మహల్.

ఇవి కూడా చదవండి

బిర్జిస్ ఖాదర్‌ను నవాబుగా చేశారు నవాబ్ వాజిద్ అలీ షా అరెస్టు తరువాత..అతని కుమారుడైన  బిర్జిస్ ఖదర్ నవాబ్ సింహాసనాన్ని అధిష్టింపజేశారు.అయితే అతను మైనర్. దీంతో   బేగం హజ్రత్ రాష్ట్ర అధికారాన్ని చేపట్టింది. అయితే అవధ్ అప్పటికే బ్రిటిష్ పాలకుల చేతికి చిక్కింది కనుక.. రాష్ట్ర పాలనా అధికారం పూర్తిగా బేగం చేతిలో లేదు.

1857లో క్విట్ ఇండియా ఉద్యమం మొదలు మీరట్‌లో బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా ఉద్యమం మొదలైన తర్వాత..  అవధ్ ప్రాంతం కూడా బ్రిటిష్ వారితో యుద్ధానికి సిద్ధమైంది. బేగం హజ్రత్ మహల్‌తో పాటు, సమీప సంస్థానాలకు చెందిన హిందూ, ముస్లిం పాలకుల సహాయంతో బ్రిటిష్ వారితో భీకర యుద్ధం చేశారు. అనేక మంది ఈ యుద్ధంలో తమ పరాక్రమాన్ని ప్రదర్శించారు. లక్నో సమీపంలో జరిగిన యుద్ధంలో.. బేగం హజ్రత్ మహల్ దిల్కుషా, చిన్‌హట్‌లలో బ్రిటిష్ వారిని ఓడించింది. అవధ్‌ను మాత్రమే కాదు.. సమీపంలోని అనేక రాచరిక రాష్ట్రాలను బ్రిటిష్ వారి బానిసత్వం నుండి విముక్తి చేసింది.

అవధ్‌ను మళ్ళీ సొంతం చేసుకున్న బ్రిటిష్ వారు:  కొన్ని రోజుల తర్వాత.. బ్రిటీష్ ప్రభుత్వం భారీ సైన్యంతో అవద్ పై యుద్ధం చేశారు. ఈసారి బేగం హజ్రత్ మహల్‌కు ఇతర రాచరిక రాష్ట్రాల నుండి అంతగా మద్దతు లభించలేదు. దీంతో ఆమె ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది.. కానీ బ్రిటిష్ సైన్యానికి చిక్కకుండా తప్పించుకుని సమీప అడవుల్లో చేరుకున్నారు. అడవుల్లో ఆశ్రయం పొంది.. ఎప్పటికప్పుడు బ్రిటిష్ వారితో పోరాడుతూనే ఉన్నారు బేగం హజ్రత్

నేపాల్‌లో తుది శ్వాస విడిచిన బేగం హజ్రత్ బేగం హజ్రత్ మహల్ అవధ్ అరణ్యాలలో నివసిస్తూ.. చాలా కాలం బ్రిటిష్ వారితో గొరిల్లాలతో పోరాడుతూనే ఉన్నారు.. అయితే ఈస్టిండియా కంపెనీ విక్టోరియా రాణి చేతిలోకి వెళ్లిన తర్వాత మన దేశంలో బ్రిటీష్ వారు మరింత బలపడ్డారు. క్రమంగా తిరుగుబాటుదారులను అణచివేయడం ప్రారంభించారు. బేగం హజ్రత్ మహల్ శక్తి కూడా తగ్గింది. దీంతో ఆమె నేపాల్‌లోని కింగ్ జంగ్ బహదూర్‌ దగ్గర ఆశ్రయం పొందారు. తన కొడుకుతో సాధారణ జీవితాన్ని గడిపేరు. చివరికి ఆమె 1879 లో నేపాల్ లోనే మరించింది. తల్లి మరణం తరవాత 1887 లో, బ్రిటిష్ వారు బేగం  కుమారుడు బిర్జిస్ కదర్ తిరిగి అవద్ రావడానికి అనుమతించారు.

1988లో తపాలా బిళ్ళ విడుదల: 1988లో జరిగిన మొదటి స్వాతంత్ర పోరాట జ్ఞాపకార్థం భారత ప్రభుత్వం కొందరి స్వాతంత్య పోరాట యోధుల పోస్టల్ స్టాంపును విడుదల చేసింది.  మొదటి స్థానంలో ఝాన్సీ రాణి లక్ష్మీబాయి, రెండవ స్థానంలో బేగం హజ్రత్ మహల్‌, మూడవ స్థానంలో తాత్యా తోపే, నాలుగో స్థానంలో బహదూర్ షా జాఫర్, మంగళ్ పాండే ,నానా సాహెబ్ తర్వాతి స్థానంలో  పోస్టల్ స్టాంప్స్ ను కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..