CSIR-NIIST Recruitment 2022: ఎంఈ/ఎంటె అర్హతతో.. సీఎస్ఐఆర్ – ఎన్‌ఐఐఎస్టీలో ప్రాజెక్ట్ స్టాఫ్ ఉద్యోగాలు.. దరఖాస్తు ఇలా..
భారత ప్రభుత్వ రంగానికి చెందిన తిరువనంతపురంలోని సీఎస్‌ఐఆర్-నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఇంటర్‌డిసిప్లీనరీ సైన్స్ అండ్ టెక్నాలజీ (CSIR-NIIST).. తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్ అసిస్టెంట్, సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ తదితర పోస్టుల (Project Assistant Posts) భర్తీకి..
CSIR-NIIST Senior Project Associate Recruitment 2022: భారత ప్రభుత్వ రంగానికి చెందిన తిరువనంతపురంలోని సీఎస్‌ఐఆర్-నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఇంటర్‌డిసిప్లీనరీ సైన్స్ అండ్ టెక్నాలజీ (CSIR-NIIST).. తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్ అసిస్టెంట్, సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ తదితర పోస్టుల (Project Assistant Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్ అసిస్టెంట్, సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులు
మొత్తం ఖాళీల సంఖ్య: 9
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 35 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్: నెలకు రూ. 20,000ల నుంచి రూ.42,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర అలవెన్సులు కూడా చెల్లిస్తారు.
అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంజినీరింగ్ డిప్లొమా/బీఎస్సీ/ఎంఈ/ఎంటెక్/ఎమ్మెస్సీ/పీహెచ్‌డీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత విభాగంలో పని అనుభవం కూడా ఉండాలి. అలాగే సీఎస్‌ఐఆర్ యూసీజీ నెట్/గేట్‌లో వ్యాలిడ్ స్కోర్ ఉండాలి.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేదీ: జులై 25, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.