AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Independence Day 2022: దేశ చరిత్రలో తొలిసారి.. ఆ రాష్ట్రంలో స్వాతంత్య్రదినోత్సవం రోజున సెలవు లేదు..!

Independence Day 2022: భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి వచ్చే ఆగస్టు 15వ తేదీకి 75 ఏళ్లు పూర్తవుతుంది. సాధారణంగానే ప్రతీ ఏటా స్వాతంత్ర్య దినోత్సవం..

Independence Day 2022: దేశ చరిత్రలో తొలిసారి.. ఆ రాష్ట్రంలో స్వాతంత్య్రదినోత్సవం రోజున సెలవు లేదు..!
Azadi Ka Amrit Mahostav
Shiva Prajapati
|

Updated on: Jul 17, 2022 | 6:43 AM

Share

Independence Day 2022: భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి వచ్చే ఆగస్టు 15వ తేదీకి 75 ఏళ్లు పూర్తవుతుంది. సాధారణంగానే ప్రతీ ఏటా స్వాతంత్ర్య దినోత్సవం రోజున దేశ వ్యాప్తంగా ప్రభుత్వ హాలిడే ఉంటుంది. కానీ, 75 ఏళ్ల చరిత్రను తిరగరాస్తూ.. ఇండిపెండెన్స్ డే రోజున సెలవును రద్దు చేసింది యూపీ ప్రభుత్వం. ఆగస్టు 15వ తేదీన ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు యధావిధిగా పని చేస్తాయని, మిగతా రోజుల మాదిరిగానే అన్ని విద్యాసంస్థలు, కార్యలయాలు ఓపెన్ చేయాల్సిందేనంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఈ నిర్ణయం కారణం వేరే ఉంది.

దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు అయిన సందర్భంగా దేశవ్యాప్తంగా ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ నిర్వహిస్తోంది కేంద్ర ప్రభుత్వం. బీజేపీ పాలిత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లోని ప్రతి జిల్లాలో ఈ రోజును ప్రత్యేకంగా నిర్వహించేందుకు ప్లాన్స్ వేస్తోంది. ఇందుకోసం ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాట్లు చేస్తోంది. ఇదే విషయాన్ని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా చెప్పారు. అయితే, ఇతర సమయాల్లో మాదిరిగా, పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాల్లో జాతీయ జెండాను ఎగురవేయడం, ఆ తరువాత వెళ్లిపోవడం చేయకూడదని, ప్రతి ఒక్కరూ తమ తమ సంస్థల్లో ఉండాలని, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ప్రత్యేక క్లీనింగ్ క్యాంపెయిన్ నిర్వహించనున్నట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీఎస్ మిశ్రా తెలిపారు. సాధారణంగా ఈ క్లీనింగ్ డ్రైవ్ ప్రతిసారీ దీపావళి సమయంలో నిర్వహిస్తారు. అయితే ఈసారి ఈ ప్రచారాన్ని జాతీయ కార్యక్రమంగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘స్వాతంత్య్ర సమరయోధులతో అనుబంధం ఉన్న అన్ని ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వారం రోజుల పాటు వివిధ కార్యక్రమాలు ఉంటాయి. స్వాతంత్య్ర దినోత్సవాన్ని కేవలం అధికారిక కార్యక్రమాలకే పరిమితం చేయలేము. ప్రజలు కూడా పాల్గొనాలి.’’ అని పిలుపునిచ్చారు.

ఇవి కూడా చదవండి

స్వచ్చంద సంస్థలు, ఎన్‌సిసి, ఎన్‌ఎస్‌ఓల క్యాడెట్‌లతో పాటు ప్రజలు కూడా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనాలని ఉత్తరప్రదేశ్ ముఖ్య కార్యదర్శి తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో సామాన్యులను సైతం పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని క్షేత్రస్థాయి సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో భాగంగా, స్వాతంత్ర్య దినోత్సవం రోజున పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాలకు సెలవును రద్దు చేసింది యోగి సర్కార్. అయితే, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత సెలవు రద్దు చేయడం ఇదే తొలిసారి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..