Viral: బ్యూటీ క్రీమ్స్‌ అనుకుంటే పొరపాటే.. కత్తిరించి చూడగా పోలిసులకు బొమ్మ కనిపించింది.! 

బ్యూటీ క్రీమ్స్ అనుకుని లైట్ తీసుకుంటే పప్పులో కాలేసినట్లే.. కత్తిరించి చూడగా అసలు గూడుపుఠాణీ బయటపడుతుంది.. అదేంటంటే..

Viral: బ్యూటీ క్రీమ్స్‌ అనుకుంటే పొరపాటే.. కత్తిరించి చూడగా పోలిసులకు బొమ్మ కనిపించింది.! 
Beauty Creams
Follow us

|

Updated on: Jul 19, 2022 | 12:53 PM

గోల్డ్ స్మగ్లింగ్ దందా యథేఛ్ఛగా సాగుతోంది. పోలీసులకు పట్టుబడకుండా ఎత్తుకు పైఎత్తు వేస్తూ స్మగ్లర్లు విదేశీ బంగారాన్ని వినూత్న రీతిలో భారత్‌కు తరలిస్తున్నారు. తమ క్రియేటివిటీకి పదునుపెట్టి బంగారాన్ని అక్రమంగా రవాణా చేస్తోన్న స్మగ్లర్ల ఆట కట్టిస్తున్నారు పోలీసులు. తాజాగా విదేశాల నుంచి తీసుకొచ్చిన బంగారాన్ని అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు. ఆ కధేంటంటే.?

వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తి ఆదివారం ఇండిగో విమానంలో దోహా నుంచి ముంబై చేరుకున్నాడు. అక్కడ నుంచి కనెక్టింగ్ ఫ్లైట్ ద్వారా సుమారు మధ్యాహ్నం 1.30 గంటలకు జైపూర్ విమానాశ్రయానికి చేరుకున్నాడు. ఇంతవరకు బాగానే ఉంది కదా.! అయితే కథలో అసలు ట్విస్ట్ ఇప్పుడే మొదలవుతుంది. అదేంటంటే.. సదరు యువకుడి వద్ద బంగారం ఉందని.. అది తమ స్కానర్లకు కూడా అంతుచిక్కలేదని.. ముంబై ఎయిర్‌పోర్ట్ సిబ్బంది అప్పటికే జైపూర్ కస్టమ్స్ అధికారులకు సమాచారాన్ని అందిస్తారు.

దీంతో పక్కా సమాచారం ప్రకారం.. సదరు యువకుడిని అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు.. అతడి బ్యాగ్‌ను మరోసారి బంగారం స్కానర్ల ద్వారా చెక్ చేశారు. ఆ సమయంలో వారికి కొన్ని నల్ల మచ్చలు కనిపించాయి. బ్యాగ్‌లోని ఓ చిన్న బకెట్‌లో చాక్లెట్లు, బ్యూటీ క్రీమ్స్‌ ఉన్నట్లు గుర్తించారు. మొదట అధికారులు వాటిని చూసి పెద్దగా డౌట్ పడలేదు. అయితే వారికి కాస్మెటిక్ ట్యూబ్స్‌పై అనుమానమొచ్చి కత్తిరించి చూడగా.. అందులో నుంచి చిన్న చిన్న బంగారు కడ్డీలు బయటపడ్డాయి. అతడి దగ్గర నుంచి మొత్తం 145.26 గ్రాముల గోల్డ్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దాని మార్కెట్ విలువ దాదాపు రూ. 7.50 లక్షలు ఉంటుందని అంచనా. యువకుడి దోహాలో కూలీ పని చేస్తున్నట్లు తెలుస్తోంది. తనకు తెలుసుకున్న స్నేహితుడు ఒకరు దోహా విమానాశ్రయంలో ఈ చాక్లెట్లు, బ్యూటీ క్రీమ్స్‌ నిండిన బకెట్‌ను ఇచ్చాడని.. అందులో ఏమున్నాయో తనకు అస్సలు తెలియదని పోలీసులకు చెప్పాడు. కాగా, అతడిపై కస్టమ్స్ అధికారులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

Gold

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం…

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు