Viral: పెళ్లై మూడేళ్లయిన జరగని ఫస్ట్ నైట్.. అనుమానమొచ్చి ఆరా తీయగా భార్యకు దిమ్మతిరిగే షాక్!

ఆమెకు వివాహమై మూడేళ్లయింది. తల్లిదండ్రులు కట్నకానుకలు ఘనంగా ఇచ్చి మరీ పెళ్లి చేశారు. కాని ఎన్నో ఆశలతో అత్తగారింట్లోకి...

Viral: పెళ్లై మూడేళ్లయిన జరగని ఫస్ట్ నైట్.. అనుమానమొచ్చి ఆరా తీయగా భార్యకు దిమ్మతిరిగే షాక్!
Marriage
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 18, 2022 | 7:08 PM

ఆమెకు వివాహమై మూడేళ్లయింది. తల్లిదండ్రులు కట్నకానుకలు ఘనంగా ఇచ్చి మరీ పెళ్లి చేశారు. కాని ఎన్నో ఆశలతో అత్తగారింట్లోకి అడుగుపెట్టిన ఆమెకు ప్రతీసారి ఎదురుదెబ్బ తగిలింది. భర్తకు దగ్గరవ్వాలని చూడగా.. అతడు ప్రతీసారి ఆమెను దూరం పెడుతూ వచ్చాడు. మూడేళ్లలో ఇద్దరూ ఒక్కసారి కూడా శారీరికంగా దగ్గరవ్వలేదు. దీంతో భర్తపై అనుమానమొచ్చి.. అత్తను ఆరా తీయగా షాకింగ్ నిజం ఒకటి బయటపడింది. సీన్ కట్ చేస్తే.!

వివరాల్లోకి వెళ్తే.. ఇండోర్‌కు చెందిన ఓ మహిళకు 2019లో ప్రీతేష్ అనే వ్యక్తితో వివాహమైంది. ఆమె తల్లిదండ్రులు సుమారు రూ. 25 లక్షలు కట్నం ఇచ్చి మరీ ఘనంగా పెళ్లి చేశారు. ఇక ఎన్నో ఆశలతో ఆమె అత్తగారింట్లోకి అడుగుపెట్టింది. అయితే సదరు మహిళకు ప్రతీ విషయంలోనూ షాక్ తగులుతూ వచ్చింది. మొదటి రాత్రి నుంచే తన భర్త ప్రీతేష్ వ్యవహారం అనుమానస్పద రీతిలో కనిపించింది. అస్సలు దగ్గరకు రానిచ్చేవాడు కాదు.. చొరవ తీసుకుని దగ్గరకు వెళ్తే ఆమెను తిట్టి పంపించేవాడు. ఇలా మూడేళ్లలో ఇద్దరూ ఒక్కసారిగా కూడా శారీరికంగా కలవలేదు. దీంతో భర్త ప్రవర్తనపై అత్తను ఆరా తీసింది సదరు మహిళ. తన కొడుకు శారీరిక, మానసిక సమస్యలతో బాధపడుతున్నాడని.. తొందర్లోనే అంతా సర్దుకుంటుందని ఆమె అత్త చెప్పుకొచ్చింది.

మరోవైపు తన లోపాన్ని భార్య ఎక్కడ బయటికి చెబుతుందోనని ప్రీతేష్ ఆమెను కట్నం కోసం వేధించడం మొదలుపెట్టాడు. రూ. 20 లక్షలు కట్నం తీసుకురావాలని.. తీసుకొస్తేనే ఇంట్లోకి అడుగుపెట్టాలని చెప్పి.. ఆ మహిళను బయటికి గెంటేశాడు. దీంతో బాధిత మహిళ పుట్టింటికి వెళ్లి.. తల్లిదండ్రులకు జరిగిందంతా చెప్పింది. కూతురి అత్తగారింటిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.