Ajith Kumar: రయ్.. రయ్.. కార్ రేసింగ్‌లో మరో కప్పు కొట్టిన హీరో అజిత్ టీమ్.. సెలబ్రేషన్స్ వీడియో ఇదిగో
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ తనకు ఇష్టమైన కార్ రేసింగ్ లో రయ్..రయ్ మంటూ దూసుకెళుతున్నాడు. ప్రమాదాలు జరుగుతున్నా జంక కుండా వరుసగా పోటీల్లో పాల్గొంటున్నాడు. తాజాగా జరిగిన మరో కార్ రేసింగ్ లో అజిత్ కుమార్ అండ్ టీమ్ ఛాంపియన్ గా నిలిచింది.

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ అటు సినిమాల్లోనూ.. ఇటు కార్ రేసింగ్ లోనూ దూసుకెళుతున్నాడు. ఇటీవలే విదాముయార్చి సినిమాతో ప్రేక్షకులను పలకరించిన అజిత్ తాజాగా జరిగిన కార్ రేసింగ్ లోనూ సత్తా చాటాడు. ఇటీవలే ఓ రేసింగ్‌లో గెలిచిన అజిత్ టీమ్ తాజాగా ఇటలీలో జరిగిన కార్ రేసింగ్-12 హెచ్ ఛాంపియన్‌షిప్‌లోనూ మూడో స్థానంలో నిలిచి సత్తా చాటింది. ఈ సందర్భంగా మువ్వన్నెల జెండాను ఊపుతూ ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నాడు అజిత్. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఇటీవలే దుబాయ్- 24 హెచ్ రేసులో అజిత్ కుమార్ టీమ్ మూడో స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఛాంపియన్ గా నిలవడంతో అజిత్ తో పాటు అతని అభిమానులు కూడా పండగ చేసుకుంటున్నారు. తమ అభిమాన హీరోకు అభినందలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అదే సమయంలో ప్రమాదాల బారిన పడకుండా మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని తమ హీరోకు సూచిస్తున్నారు.
ఇక సినిమాల విషయానికొస్తే అజిత్ ఇటీవలే విదాముయార్చి సినిమాలో కనిపించాడు. తెలుగులో ఇది పట్టుదలగా విడుదలైంది. సౌతిండియన్ బ్యూటీ క్వీన్ త్రిష ఇందులో హీరోయిన్ గా నటించింది. ఫిబ్రవరి 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆడియెన్స్ ను బాగానే ఆకట్టుకుంది. ఇక మార్చి 3 నుంచి నెట్ ఫ్లిక్స్ ఓటీటీలోనూ ఈ సినిమా స్ట్రీమింగ్ కు రాగా అక్కడ కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.
రేస్ తర్వాత జాతీయ జెండాతో అజిత్ కుమార్.. వీడియో..
Victory in style! 🏆🔥 Team @Akracingoffl shines at the 12H Mugello, Italy, celebrating a fantastic podium finish! 🏁
Kudos to @fabian_fdx89, @mathdetry, and @BasKoetenRacing for their stellar performance on the track! 🚀🏎️#AKR #AjithKumar | #AjithKumarRacing #24HSeries… pic.twitter.com/1ug9mohbTr
— Suresh Chandra (@SureshChandraa) March 23, 2025
ప్రస్తుతం అజిత్ మరో యాక్షన్ థ్రిల్లర్ మూవీ గుడ్ బ్యాడ్ అగ్లీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రంలో నూ త్రిష హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాకు అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించగా.. మైత్రి మేకర్స్ బ్యానర్‌లో వై రవిశంకర్, నవీన్ యేర్నేని నిర్మించారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.