Tollywood: ఏంది భయ్యా.. టాలీవుడ్ క్రేజీ విలన్ రామిరెడ్డి మళ్లీ పుట్టారా..?
1989 లో రాజశేఖర్ హీరోగా వచ్చిన అంకుశం చిత్రంలో ప్రతినాయకుడిగా పరిశ్రమలోకి అడుగు పెట్టారు రామి రెడ్డి. మొదటి సినిమాకే ఆయన నంది పురస్కారం అందుకున్నారు. ఆ తర్వాత ఆయనకు చాలా చిత్రాల్లో మెయిన్ విలన్ అవకాశాలు లభించాయి. దివంగత రామిరెడ్డి పోలిన వ్యక్తి ఇప్పుడు వైరల్ అవుతున్నాడు.

స్పాట్ పెడ్తా.. అనేది తెలుగు సినిమాల్లో బాగా పాపులర్ అయిన డైలాగ్. ‘అంకుశం’ సినిమాతో నటుడిగా పరిచయమయిన రామిరెడ్డి ట్రేడ్ మార్క్ డైలాగ్ ఇది. ఆ మూవీలో విలన్ రోల్‌లో ఒదిగిపోయారు ఈ యాక్టర్. అందులో రామిరెడ్డి పలికిన స్పాట్ పెడ్తా అన్న డైలాగ్ ఎంతగానో జనాదరణ పొందింది. తొలి చిత్రమే సూపర్ హిట్ అవ్వడంతో ఆయనకు వరుసగా అవకాశాలొచ్చాయి. తెలుగు మాత్రమే కాదు అటు హిందీ, తమిళం, కన్నడ మలయాళం, భోజ్‌పురి భాషల్లోనూ నటించారు. 250కిపైగా చిత్రాల్లో రకరకాల పాత్రలతో ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారు. రామిరెడ్డి ఆఖరిగా నటించిన చిత్రం ‘మర్మం’. లివర్ డిసీజ్ కారణంగా 55 ఏళ్ల వయస్సుకే 2011లో రామిరెడ్డి ఈ లోకాన్ని వీడారు. గుర్తుపట్టేలేనంత సన్నగా అయిపోయి.. కొన్నాళ్లు ఇంటికే పరిమితం అయి 2011, ఏప్రిల్ 14న కన్నుమూశారు.
కాగా రామిరెడ్డి స్వస్థలం చిత్తూరు జిల్లా ఓబుళంవారిపల్లె. సినిమాల్లోకి రాకముందు ఆయన ఓ ఉర్దూ పత్రికలో జర్నలిస్ట్‌గా పనిచేశాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కాగా ఇప్పుడు రామిరెడ్డి గురించి ఎందుకు చెబుతున్నాం అనేగా మీ డౌట్. అక్కడికే వస్తున్నాం. సేమ్ టూ సేమ రామిరెడ్డిలానే ఉన్న ఓ వ్యక్తి తారసపడ్డాడు. ఓ హోటల్‌లో పనిచేస్తున్న వ్యక్తి అచ్చం రామిరెడ్డిని పోలి ఉండటంతో.. వీడియో తీసిన ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఆ వీడియో వైరల్‌గా మారింది. మనుషుల్ని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారు.. అలానే ఈయన రామిరెడ్డిని పోలి ఉన్నారుఅని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.
View this post on Instagram