Sushant Singh Rajput: సుశాంత్ మృతి కేసులో బిగ్ ట్విస్ట్.. సీబీఐ ఫైనల్ రిపోర్డులో రియా గురించి ఏముందంటే?
దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పూత్ మృతి కేసులో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. సుశాంత్ మరణానికి సంబంధించి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ).. రెండు కేసులను క్లోజ్ చేసింది. ఇదే సమయంలో సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తికి సంచలన విషయాలను బయట పెట్టింది.

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై సీబీఐ తన దర్యాప్తు నివేదికను శనివారం (మార్చి 23) సమర్పించింది. సరిగ్గా నాలుగున్నర సంవత్సరాలు దర్యాప్తు నిర్వహించిన తర్వాత, సీబీఐ ఇప్పుడు తన తుది దర్యాప్తు నివేదికను సమర్పించి కేసును ముగించింది. అంతేకాకుండా, సుశాంత్ సింగ్ మరణంలో మరొకరి ప్రమేయం ఉందని సూచించడానికి ఎటువంటి ఆధారాలు అందుబాటులో లేవని నివేదికలో పేర్కొంది. అంటే సుశాంత్ సింగ్ మరణం హత్య కాదు, ఆత్మహత్యని నివేదికలో పేర్కొంది సీబీఐ. అయితే ప్రత్యేక కోర్టు సీబీఐ సమర్పించిన నివేదికను అంగీకరిస్తుందా లేదా తదుపరి దర్యాప్తు కోసం నివేదిస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. సుశాంత్ కేసు కోర్టులో ఇంకా పెండింగ్‌లో ఉంది. అయితే, ఈ కేసును దర్యాప్తు చేసిన సీబీఐ, సుశాంత్ సింగ్ మరణం హత్య కాదని పేర్కొంటూ ఒక నివేదికను విడుదల చేయడం సంచలనంగా మారింది. దీంతో ఈ కేసులో నిందితులుగా ఉన్న రియా చక్రవర్తి ఇతరులకు ఇప్పుడు ఉపశమనం కలిగింది. సీబీఐ నివేదిక తర్వాత, సుశాంత్ సింగ్ కేసులో కోర్టు కూడా తుది తీర్పు వెలువడే అవకాశం ఉంది.
సీబీఐ నివేదిక తర్వాత, రియా చక్రవర్తి న్యాయవాది మనేషిండే సోషల్ మీడియాలో ఒక సందేశాన్ని పంచుకున్నారు .. ‘సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో సీబీఐ ముగింపు నివేదికను దాఖలు చేసింది, మేము CBI కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసును అన్ని కోణాల నుండి దర్యాప్తు చేసిన సీబీఐ చివరకు కేసును ముగించడానికి ఒక నివేదికను సమర్పించింది. ఈ కేసు గురించి సోషల్ మీడియాలో మరియు టీవీ మీడియాలో వ్యాపించిన తప్పుడు నివేదికలు చాలా పరువు నష్టం కలిగించాయి. ఈరోజు, ఒక సైనికుడి కుటుంబం కోసం పోరాడినందుకు సంతోషంగా ఉందని నేను గర్వంగా చెబుతున్నాను. ‘దేశంలోని ప్రతి పౌరుడు న్యాయం కోరుతున్నాడు, నాకు ఇప్పుడు న్యాయం జరిగింది’ అని ఆయన పేర్కొన్నారు.
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంపై సీబీఐ సమర్పించిన రిపోర్టు ఇప్పుడు సంచలనంగా మారింది. మరి ఈ నివేదికపై ముంబై కోర్టు, సుశాంత్ కుటుంబ సభ్యులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
Breaking : CBI files closure report in Sushant Singh Rajput’s case.
– Natural Suicide – No Foul Play involved
This country owes an apology to Rhea Chakraborty, Media launched a witch hunt against her, destroyed her dignity , made her national villain, abused her day in and… pic.twitter.com/fywlX5xIam
— Roshan Rai (@RoshanKrRaii) March 22, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.