Tollywood: 79 ఏళ్ల వయసులో నాలుగో వివాహం చేసుకున్న స్టార్ నటుడు.. అది కూడా 29 ఏళ్లు చిన్నదైన నటితో..
తన అత్యద్భుత నటనతో సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడీ నటుడు. అయితే ఆయన వ్యక్తిగత జీవితం ఎప్పుడూ హాట్ టాపిక్కే. తాజాగా ఈ నటుడు నాలుగో వివాహం చేసుకున్నాడు. అది కూడా తన కంటే వయసులో 30 సంవత్సరాలు చిన్నదైన నటితో..

ప్రస్తుతం బాలీవుడ్‌లో నటుడు ఆమిర్ ఖాన్, గౌరీ స్ప్రాట్ ల డేటింగ్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా వీరిద్దరి ఏజ్ గ్యాప్ గురించి నెట్టింట తీవ్రమైన చర్చ నడుస్తోంది. అయితే ఇది జరుగుతుండగానే బాలీవుడ్ కు చెందిన ఓ స్టార్ నటుడు 70 ఏళ్ల వయసులో నాలుగో సారి వివాహం చేసుకున్నాడు. అది కూడా తన కూతురి వయసున్న 29 ఏళ్ల నటితో. ఆయన మరెవరో కాదు నటుడు కబీర్ బేడి. హిందీతో పాటు పలు తెలుగు సినిమాల్లోనూ నటించాడీ లెజెండరీ యాక్టర్. సమంత శాకుంతలం, బాలకృష్ణ పైసా వసూల్, గౌతమీ పుత్ర శాతకర్ణి తదతర తెలుగు సినిమాలతో తెలుగు ఆడియెన్స్ ను పలకరించారీ సీనియర్ యాక్టర్. సినిమాల సంగతి పక్కన పెడితే ఈ నటుడి వ్యక్తిగత జీవితం ఎప్పుడూ హాట్ టాపిక్కే. ఇప్పటివరకు ఆయన నాలుగు సార్లు వివాహం చేసుకున్నాడు. కబీర్ బేడి మొదటి వివాహం 1969లో నర్తకి ప్రొతిమా బేడితో జరిగింది. వారిద్దరికీ పూజా బేడి, సిద్ధార్థ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన తర్వాత కబీర్ బ్రిటిష్ ఫ్యాషన్ డిజైనర్ సుసాన్ హంఫ్రీస్‌ను రెండవసారి వివాహం చేసుకున్నాడు. ఈ వివాహం కూడా ఎక్కువ కాలం నిలవలేదు, ఆ తర్వాత రేడియో ప్రెజెంటర్ నిక్కీని మూడవసారి వివాహం చేసుకున్నాడు కబీర్. కానీ ఈ వివాహ బంధం కూడా ఎక్కువ కాలం నిలవలేదు. చివరికి వారు 2005 లో విడాకులు తీసుకున్నారు.
కబీర్ బేడి 70 ఏళ్ల వయసులో మళ్ళీ ప్రేమలో పడి నాల్గవసారి వివాహం చేసుకున్నాడు. భారతీయ సంతతికి చెందిన బ్రిటిష్ నటి, నిర్మాత పర్వీన్ దుసాంజ్‌ను కబీర్ నాల్గవసారి వివాహం చేసుకున్నాడు. పర్వీన్ కబీర్ కంటే సుమారు 30 సంవత్సరాలు చిన్నది. కబీర్ బేడి, పర్వీన్ దాదాపు 3-4 సంవత్సరాలుగా డేటింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. కూతురు పూజా పేరు మీద ఉన్న ఫ్లాట్ లోనే ఈ జంట కలిసి జీవిస్తున్నారు. ప్రస్తుతం కబీర్ బేడీ వివాహం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.
భార్యతో కబీర్ బేడీ..
View this post on Instagram
కబీర్ బేడి హిందీ, తెలుగుతో పాటు పలు విదేశీ చిత్రాల్లో నటించారు. 1960లో సినిమా కెరీర్ ప్రారంభించిన ఆయన 70లలో స్టార్ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అత్యధిక విదేశీ చిత్రాలను నిర్మించిన వ్యక్తిగా ఆయన రికార్డు సృష్టించారు. ఇప్పటివరకు ఎవరూ ఈ రికార్డును బద్దలు కొట్టలేకపోయారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి