Sukumar: బాలీవుడ్‌లోకి డైరెక్టర్ సుకుమార్! ఆ స్టార్ హీరోతో సినిమాకు ప్లాన్! అసలు విషయమిదే
'పుష్ప 2' తో మరో బ్లాక్ బస్టర్ కొట్టిన డైరెక్టర్ సుకుమార్ ఇప్పుడు కొంత విరామం తీసుకుంటున్నారు. ఆ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి సుక్కూ ఒక సినిమా చేయాల్సి ఉంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌లను ఆయన పర్యవేక్షిస్తున్నారు.

పుష్ప2 తో మరోసారి పాన్ ఇండియా రేంజ్ లో ఫేమస్ అయిపోయాడు టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్. ప్రస్తుతం సుక్కుతో కలిసి సినిమాలు తీసేందుకుస్టార్ హీరోలు క్యూ కడుతున్నారు. అయితే ఈ స్టార్ డైరెక్టర్ గురించి నెట్టింట ఒక వార్త తెగ వైరలవుతోంది. అదేంటంటే.. బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కలిసి ఆయన ఓ సినిమా చేయబోతున్నారని ప్రచారం జరుగుతోంది . ఈ కాంబినేషన్ గురించి సోషల్ మీడియాలో కూడా పలు పోస్టులు దర్శనిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. అయితే ఇందులో ఏ మాత్రం నిజం లేదని తెలుస్తోంది. షారుఖ్ ఖాన్ గతంలో సౌత్ డైరెక్టర్ అట్లీతో కలిసి పనిచేశాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ సినిమా తర్వాత, షారుఖ్ ఖాన్ దక్షిణాది దర్శకులతోనే సినిమాలు తీసేందుకు రెడీ అవుతున్నారు. ఈ కారణంగానే ఇప్పుడు ‘పుష్ప 2’ సినిమా హిట్ అవ్వడంతో షారుఖ్, సుకుమార్ కలిసి సినిమా చేయనున్నారనే వార్తలు వచ్చాయి. ఈ సినిమా గురించి చర్చించడానికి సుకుమార్ ముంబైకి వెళ్లారని సమాచారం. అయితే ఇవన్నీ కేవలం పుకార్లేనని తెలుస్తోంది. సుకుమార్ ఇటీవల ముంబైకి వెళ్లడం గురించి ఎటువంటి సమాచారం లేదు. ఒక వేళ సుక్కూ ముంబైకు వెళ్లి ఉంటే కనీసం ఒక్క ఫొటో అయినా బయటకు వచ్చేది.
ప్రస్తుత పరిస్థితిలో, సుకుమార్ హిందీ చిత్రాలకు దర్శకత్వం వహించడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదు. బదులుగా తెలుగు చిత్రాలను తెరకెక్కించి వాటిని పాన్-ఇండియన్ స్థాయిలో విడుదల చేయడానికి సుక్కూ ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు 2023లో, షారుఖ్ ఖాన్ చిత్రాలు ‘పఠాన్’, ‘జవాన్’, ‘డంకీ’ విడుదలయ్యాయి. 2024లో అతని సినిమాలు ఏవీ విడుదల కాలేదు. అంతేకాదు షారుఖ్ ఇంకా కొత్త సినిమాలు అంగీకరించలేదని తెలుస్తోంది. అందువల్ల, ఈ సంవత్సరం కూడా అతని సినిమా విడుదల కాకపోవచ్చని తెలుస్తోంది.
According to the reports, Megastar Shah Rukh Khan may Collab with Blockbuster director Sukumar for a rural action political thriller movie, in which he will play an anti hero.😱🔥#SRK #ShahRukhKhan𓀠 #Sukumar pic.twitter.com/YUThXITZGh
— Bollywood Now (@BollywoodNow) March 18, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.