- Telugu News Photo Gallery Cinema photos Anasuya Bharadwaj Visits Kashi Varanasi Temple With Her Family, See Photos Here
Anasuya Bharadwaj: ఆధ్యాత్మిక యాత్రలో అనసూయ.. ఫ్యామిలీతో కలిసి కాశీలో ప్రత్యేక పూజలు.. ఫొటోస్ ఇదిగో
సినిమాలు, టీవీ షోలతో బిజి బిజీగా ఉండే అనసూయ వారణాసి వెళ్లింది. తన కుటుంబ సభ్యులతో కలిసి కాశీ విశ్వేశ్వరుడిని దర్శించుకుంది. అలాగే వారణాసి వంటకాలను రుచి చూసింది. షాపింగ్ కూడా చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతున్నాయి.
Updated on: Mar 20, 2025 | 10:47 PM

స్టార్ యాంకర్ అనసూయ భరద్వాజ్ ఈ మధ్యన సినిమాల్లోనే ఎక్కువగా కనిపిస్తోంది. అడపా దడపా మాత్రమే టీవీషోల్లో సందడి చేస్తోంది.

తాజాగా ఈ అందాల తార తన కుటుంబ సభ్యులతో కలిసి కాశీ యాత్రకు వెళ్లింది. అక్కడ కాశీ మందిరాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసింది.

ఇక వారణాసిలో షాపింగ్ కూడా చేసిన అనసూయ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన బెనారస్ చీరలు కొనుగోలు చేసింది. అలాగే కాశీ వంటకాలను రుచి చూసింది.

తన కాశీ యాత్రకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది అనసూయ. దీంతో కొద్ది క్షణాల్లోనే అవి వైరల్ గా మారాయి.

ఇక సినిమాల విషయానికి వస్తే.. గతేడాది అల్లు అర్జున్ పుష్ప 2 లో మరో పవర్ ఫుల్ రోల్ లో కనిపించింది అనసూయ. దాక్షాయణిగా మెప్పించింది.

ప్రస్తుతం పవన్ కల్యాణ్ నటిస్తోన్న హరి హర వీరమల్లు సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తోంది. ఇటీవల ఆమె లుక్ కు సంబంధించిన ఫొటలు కూడా నెట్టింట వైరలయ్యాయి





























