OTT Movie: రిలీజ్‌కు ముందే 14 ఇంటర్నేషనల్ అవార్డ్స్.. సడెన్ గా ఓటీటీలోకి వచ్చేసిన సుకుమార్ కూతురి సినిమా
టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ గారాల పట్టి సుకృతి వేణి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం గాంధీ తాత చెట్టు. ఈ సినిమా రిలీజ్ కు ముందే రికార్డులు కొల్లగొట్టింది. ఇంటర్నేషనల్ ఫిలిం అవార్డ్స్ సొంతం చేసుకున్న ఈ మూవీ పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లోనూ ప్రదర్శితమైంది.

పుష్ప 2 సినిమాతో దేశవ్యాప్తంగా డైరెక్టర్ సుకుమార్ పేరు మరోసారి మార్మోగిపోయింది. ఈ సినిమా సృష్టించిన రికార్డులు అన్నీ ఇన్నీ కాదు. ఇప్పుడు సుకుమార్ కూతురు కూడా తండ్రి అడుగు జాడల్లోనే నడుస్తోంది. అయితే డైరెక్టర్ గా కాదు.. నటిగా. సుకుమార్ కు ఇద్దరు పిల్లలున్నారు. వారిలో ఒకరు అబ్బాయి కాగా మరొకరు అమ్మాయి. తన పేరు సుకృతి వేణి. ఈమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం గాంధీ తాత చెట్టు. పద్మావతి మల్లాది తెరకెక్కించిన ఈ సినిమాకు కుమార్ భార్య బబితనే నిర్మాతగా వ్యవహరించింది. అలాగే మైత్రీ మూవీ మేకర్స్ కూడా సహకారం అందించింది. గణతంత్ర దినోత్సవం కానుకగా జనవరి 24న థియేటర్లలో విడుదలైన గాంధీ తాత చెట్టు కంటెంట్ పరంగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. మహేష్ బాబు, రామ్ చరణ్ తదితర సినీ ప్రముఖులు గాంధీ తాత చెట్టు సినిమాను చూసి ప్రశంసలు కురిపించారు. ఇక స్టూడెంట్ గా నటించిన సుకుమార్ కూతురి యాక్టింగ్ కు ఫిదా అయ్యారు. ఇలా ఎన్నో విశేషాలున్న గాంధీ తాత చెట్టు సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. అది కూడా ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే.
‘గాంధీతాత చెట్టు’ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. ఈ క్రమంలో శుక్రవారం (మార్చి 21) నుంచి ఈ సినిమా సడెన్ గా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. ఈ చిత్రంలో సుకృతి వేణితో పాటు , రాగ్ మయూర్, ఆనంద్ చక్రపాణి, రఘురామ్, భాను ప్రకాష్, నేహాల్ ఆనంద్ కుంకుమ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.
అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్..
GandhiTathaChettu (Telugu) Now Streaming on PrimeVideo !!#OTT_Trackers pic.twitter.com/Juj0r0Y0Ny
— OTT Trackers (@OTT_Trackers) March 21, 2025
ఇక సినిమా కథ విషయానికి వస్తే.. గాంధీజీ సిద్ధాంతాల్ని పాటించే ఓ పదమూడేళ్ల అమ్మాయి తన గ్రామాన్ని కాపాడుకునేందుకు ఏం చేసిందన్నది ఈ సినిమాలో చూపించారు. నేటి తరం పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా కచ్చితంగా గాంధీ తాత చెట్టు సినిమాను చూడాలని మేకర్స్ కోరుతున్నారు. మరి మీరు కూడా ఈ వీకెండ్ లో ఈ మూవీ పై ఓ లుక్కేయండి.
“Gandhi Tatha Chettu” – A Must-Watch Gem on Amazon Prime!
Just watched Gandhi Tatha Chettu, and it’s an absolute masterpiece! The storytelling is gripping, the emotions are raw, and the performances are outstanding. A perfect blend of suspense, depth, and soul-stirring moments. pic.twitter.com/FS812bwmHV
— Venu Gopal 🐉🐯 (@VenuGopal200723) March 21, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.