Dharma Yugam Song: భిక్షాటన రహిత సమాజం కోసం.. వందేమాతరం శ్రీనివాస్ ఆలపించిన ధర్మయుగం సాంగ్ విన్నారా?
భిక్షాటన రహిత సమాజం సాధించాలనే సందేశాన్ని తెలిపేలా ధర్మ యుగం పేరుతో వందేమాతరం శ్రీనివాస్ ఓ పాటను ఆలపించి రూపొందించారు. ఈ పాటలో ఆయనతో పాటు మరో నటుడు నంద కిషోర్ కూడా నటించాడు. తాజాగా ఈ సాంగ్ లాంఛ్ ఈవెంట్ అట్టహాసంగా జరిగింది.

భిక్షాటన రహిత ప్రపంచాన్ని సాధించాలనే సందేశాన్ని తెలిపేలా ధర్మ యుగం పేరుతో సందేశాత్మక పాటను లాంచ్ చేశారు స్ఫూర్తి విజేత విద్యా సంస్థలు. హైద్రాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ వేదికగా ధర్మ యుగం, హ్యూమానిటీ బెగ్గర్ ఫ్రీ సిటీ ట్యాగ్ లైన్ తో సాంగ్ ను ఎమ్మెల్యే ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే రాజేశ్వర్ రెడ్డి హజరై ప్రారంభించారు. ప్రముఖ తెలుగు మ్యూజిక్ డైరెక్టర్, సింగర్ వందే మాతరం శ్రీనివాస్ సామాజిక బాధ్యతను చాటుకునేందుకు ఈ పాటను రూపొందించారన్నారు విజేత సంస్థల చైర్మన్. ఈ పాట ద్వారా సమాజంలో అందరు కలిస్తేనే, బెగ్గర్ ఫ్రీ సిటీ గా మార్చవచ్చు అన్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాల సామాజిక బాధ్యత గా చేస్తున్న కృషి గుర్తిస్తూ అవార్డ్స్ తో సత్కరించారు. అనాథలకు లాస్ట్ రైట్స్ నిర్వహిస్తున్న ఎన్ జీవో, బిక్షాటన రూపు మాపేందుకు కృషి చేస్తున్న స్వచ్చంద సంస్థలు, పేదలకు ఉచితంగా వైద్యం అందిస్తున్న డాక్టర్స్ ను అవార్డులతో సన్మానించారు. బెగ్గర్ ప్రీ సొసైటీ క్రియేట్ చేసేందుకు విజేత పూర్వ విద్యార్థులు కలిసి సమాజంలో అవగాహన కల్పించడం సంతోషంగా ఉందన్నారు. సోషల్ రెస్పాన్సిబిలిటీ ని ప్రదర్శిస్తున్న ధర్మ యుగం పాట ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటోంది.
ప్రస్తుతం ఉన్న కలియుగంలో ధర్మాన్ని రక్షించినప్పుడే ఆ ధర్మం మనలను రక్షిస్తుందంటున్నారు విజేత పూర్వ విద్యార్థులు, పలు ఎన్జీవో సంస్థల ప్రతినిధులు. నగరాల్లో వివిధ రకాల అసమానతలకు గురైన, ఆర్ధిక అవసరాల కోసం అనాధలుగా మారి చిల్డ్రన్, హోం లెస్ సీనియర్ సిటిజన్స్, ట్రాఫికింగ్ ద్వారా ఎందరో మహిళలు బిక్షాటన లోకి బలవంతంగా వస్తున్నారన్నారు. యాచకత్వంలో మగ్గిపోయే వారిని రక్షించేదుంకు ప్రభుత్వాలు, పోలీసులు, స్వచ్ఛంధ సంస్థలు పని చేస్తున్నప్పటికి సమాజంలో ప్రతి ఒక్కరు బాధ్యతగా ముందు వచ్చి..యాచకత్వంలోకి నెట్టబడుతున్న వారిని తమ వంతు సాయంతో రక్షించాలన్నారు. అప్పుడే పూర్తి స్థాయిలో యాచకత్వాన్ని నిర్మూలించవచ్చన్నారు. బెగ్గర్ ఫ్రీ సిటీ ట్యాగ్ లైన్ తో సరికొత్త కాన్సెప్ట్ తో ప్రముఖ సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ వందేమాతరం శ్రీనివాస్ ఈ సందేశాత్మక పాటను రూపొందించారు. ఈ పాట డైరెక్టర్ సుధీర్ వర్మ, ప్రొడ్యూసర్ బీహెచ్ . వీ. రామ కృష్ణ రాజు, పాటలో నటించిన నటుడు నంద కిషోర్ సాంగ్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ధర్మయుగం ఫుల్ సాంగ్
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.