చేసిన సినిమాల్లో 10 డిజాస్టరే.. అయినా కోట్ల ఆస్తి కూడబెట్టిన ముద్దుగుమ్మ ఎవరంటే?
చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టి ఎంతో మంది వేల కోట్ల ఆస్తులను కూడబెట్టుకుంటున్నారు. అందులో ఓ గ్లామర్ బ్యూటీ కూడా ఉంది. ఈ ముద్దుగుమ్మ అందం చూస్తే ఎవ్వరికైనా మతిపోవాల్సిందే. తన అందం, నటనతో బాలీవుడ్‌నే షేక్ చేసిన బ్యూటీ, స్పెషల్ సాంగ్స్ చేసి మంచి ఫేమ్ సొంతం చేసుకుంది. వరస ఆఫర్స్‌తో దూసుకెళ్తున్న ఈ చిన్నది ఏకంగా కోట్ల రూపాయల ఆస్తి కూడబెట్టిందంట. చివరకు ఓ దీవిని కూడా కొనుగోలు చేసిందంట. ఇంతకీ ఆ చిన్నది ఎవరునుకుంటున్నారా?
Updated on: Mar 23, 2025 | 9:33 AM

శ్రీలంకలో పుట్టి పెరిగి, అక్కడే టీవీ రిపోర్టర్‌గా కెరీర్ స్టార్ట్ చేసి, మోడలింగ్ చేసి, తర్వాత 2006లో మిస్ యూనివర్స్ శ్రీలంక కిరీటాన్ని అందుకున్న ముద్దుగుమ్మ జాక్వాలిన్ పెర్నాండేజ్. ఈ బ్యూటీ గురించి ఎంత చెప్పినా తక్కవే. వన్నె తగ్గని అందం ఈ ముద్దుగుమ్మసొంతం.

బ్యూటీ జాక్వాలిన్ 2009లో అలాదిన్ సినిమాతో బాలీవుడ్ సిల్వర్ స్ర్రీన్ పైకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత హౌస్ ఫుల్ 2, రేస్ 2 వంటి సినిమాలతో మంచి పాపులారిటీ సొంతం చేసుకుంది. తర్వాత వరసగా పలు సినిమాలు చేసింది. అయితే ఈ ముద్దుగుమ్మ చేసిన సినిమాల్లో 10 డిజాస్టరే అయినా ఈఅమ్మడు క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు

ఇప్పటికీ వరసగా ఆఫర్స్ అందుకుంటూ మంచి ఫామ్‌లో ఉంది. ఈ క్రమంలోనే ఈ చిన్నదానికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది అది ఏమిటంటే?

జాక్వాలిన్ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన తర్వాత ఏకంగా 160 కోట్లకు పైగానే ఆస్తులు కూడబెట్టిందంట. అంతే కాకుండా ఈ ముద్దుగుమ్మ సంవత్సరానికి రూ.15 కోట్లకు పైగా సంపాదిస్తున్నట్లు సమాచారం.

అంతేకాకుండా గతంలో ఈ చిన్నది నార్త్ తీరంలో ఉన్న నాలుగు ఎకరాల ఓ ఐలాండ్‌ను 2012లోనే రూ.3.5 కోట్లకు కొనుగోలు చేసిందంటూ అనేక వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.





























