- Telugu News Photo Gallery Cinema photos Rashmi expresses love by showing a love symbol in a blue dress
సిగ్గుపడుతూ.. తన ప్రేమను వ్యక్తపరుస్తున్న రష్మీ..ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే!
అందాల ముద్దుగుమ్మ రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ బ్యూటీ తాజాగా తన అందాలతో కుర్రకారును ఫిదా చేసింది. బ్లూ కలర్ డ్రెస్‌లోలో లవ్ సింబల్ చూపిస్తూ.. తన అందంతో చంపేస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. మరి మీరు కూడా ఫొటోస్ పై ఓ లుక్ వేయండి.
Updated on: Mar 23, 2025 | 8:12 AM

జబర్దస్త్‌లో యాంకరింగ్ చేస్తూ మంచి ఫేమ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ రష్మీ గౌతమ్. అంతకముందు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పలు సినిమాల్లో నటించింది ఈముద్దుగుమ్మ. కానీ సినిమాలతో రాని ఫేమ్ ఈ బ్యూటికి జబర్దస్త్‌తో వచ్చిందని చెప్పాలి.

ముఖ్యంగా జబర్దస్త్‌లో సుధీర్‌తో లవ్ ట్రాక్‌తో మరింత పాపులారిటీ సంపాదించుకుంది. వీరిద్దరు అంటే చాలా మందికి ఇష్టం. వీరిద్దరు ప్రేమలో ఉన్నారు, త్వరలో వివాహం చేసుకుంటారని చాలా మంది అనుకున్నారు.

కానీ తమ అభిమానులకు షాకిస్తూ.. మా ఇద్దరి మధ్య ఉన్నది స్నేహం మాత్రమే, ఏదైనా సెట్‌లో ఉన్నవరకే తర్వాత తాను ఎవరో నేను ఎవరో అన్నట్లే ఉంటాం అని చెప్పి షాకిచ్చారు.

ఇక ప్రస్తుతం సుధీర్ వరస సినిమాలతో ఫుల్ బిజీగా కాగా, రష్మీ జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలలో యాంకర్‌గా చేస్తుంది. ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది తాజాగా బ్లూకలర్ డ్రెస్‌లో ఫొటోలకు ఫోజులిచ్చింది.

అందులో ఈ ముద్దుగుమ్మ చూడటానికి చాలా అందంగా కనిపిస్తుంది. అంతే కాకుండా సిగ్గుపడుతూ.. లవ్ సింబల్ చూపిస్తూ ఆమె ఫొటోలకు ఫోజులివ్వడంతో, సుధీర్ కోసమా అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఆమె ఫ్యాన్స్.





























