OTT Movie: కాలేజీలో 42 ప్రేతాత్మలు.. ఓటీటీలోకి ఆది పినిశెట్టి లేటెస్ట్ హారర్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే
ఓటీటీ ఆడియెన్స్ కు థ్రిల్ అందించేందుకు మరో సరికొత్త హారర్ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ కు రానుంది. ఇటీవల థియేటర్లలో విడులైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. కాలేజీ లో చదువుకునే స్టూడెంట్స్ వరుసగా హత్యకు గురికావడం, ఇందకు అక్కడ సంచరించే 42 ప్రేతాత్మలే కారణమన్న నేపథ్యంలో ఈ మూవీ సాగుతుంది.

గతంలో పలు సినిమాల్లో హీరోగా నటించి మెప్పించాడు ఆది పినిశెట్టి. అయితే పెళ్లి తర్వాత పెద్దగా వెండితెరపై కనిపించలేదీ ట్యాలెంటెడ్ యాక్టర్. చాలా గ్యాప్ తర్వాత శబ్దం అనే డిఫరెంట్ హారర్ అండ్ థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అరివళగన్ తెరకెక్కించిన ఈ మూవీలో కోలీవుడ్ బ్యూటీ లక్ష్మీ మేనన్ కథానాయికగా కనిపించింది. గతంలో ఆది పినిశెట్టి- అరివళగన్ కాంబినేషన్ లో వైశాలి అనే సూపర్ హిట్ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో రిలీజ్ కు ముందే ‘శబ్దం’పై అంచనాలు పెరిగిపోయాయి. దీనికి తోడు టీజర్, ట్రైలర్ ఆసక్తికరంగా ఉండడంతో ఈ సినిమాపై పాజిటివ్ వైబ్ క్రియేట్ అయ్యింది. అందుకు తగ్గట్టుగానే ఫిబ్రవరి 28వ తేదీన థియేటర్లలో రిలీజైన శబ్ధం సినిమాకు మంచి స్పందనే వచ్చింది. టైటిల్ కు తగ్గట్టుగానే ‘సౌండ్’ నేపథ్యంలో సాగే ఈ సినిమా ఆడియెన్స్ ను థ్రిల్ కు గురి చేసింది. ఇక తమన్ అందించిన బీజీఎమ్ సినిమాకు హైలెట్ గా నిలిచింది.అయితే ఇన్ని పాజిటివ్ అంశాలున్నా ఈ మూవీ పెద్దగా లాంగ్ రన్ కొనసాగించలేకపోయింది. థియేటర్లలో ఆడియెన్స్ ను భయపెట్టిన శబ్దం మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది.
ఉగాది కానుకగా మార్చి 28 నుంచి శబ్దం సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరో రెండు రోజుల్లో అధికారిక ప్రకటన రానుందని సమాచారం. సెవెన్ జీ ఫిల్మ్స్, ఆల్ఫా ఫ్రేమ్స్ బ్యానర్లపై శివ, భానుప్రియ శివ శబ్దం సినిమాను నిర్మించారు. సీనియర్ హీరోయిన్లు సిమ్రాన్, లైలా ఈ మూవీలో ప్రధాన పాత్రలు పోషించడం విశేషం. అలాగే రెడిన్ కింగ్ స్లే, ఎంఎస్ భాస్కర్, రాజీవ్ మేనర్, వివేక్ ప్రసన్న, టీఎస్సార్ శ్రీనివాసన్ తదితరులు ఈ మూవీలో మెరిశారు. మరి థియేటర్లలో శబ్ధం సినిమాను మిస్ అయ్యారా? అయితే మరికొన్ని రోజులు ఆగండి ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.
శబ్దం ఇంత భయంకరంగాఉంటుందా?
Sound of fear, Roar of success! 🔥 #Sabdham is Running Successfully in cinemas, leaving audiences thrilled !
Booking Link : https://t.co/ZrGMwgFucJ
Experience The #SoundThriller ❤️🔥
From the makers of #Vaishali
Starring @AadhiOfficial An @dirarivazhagan Film A @MusicThaman… pic.twitter.com/61KDrMb5Yq
— Mythri Movie Distributors LLP (@MythriRelease) March 5, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.