Mazaka OTT: అప్పుడే ఓటీటీలోకి సందీప్ కిషన్ ‘మజాకా’.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
మజాకా సినిమాలో సందీప్ కిషన్, రావు రమేశ్ తండ్రీ కొడుకులుగా నటించారు. రీతూ వర్మ కథానాయికగా కనిపించింది. ఈ సినిమాతోనే మన్మథుడు హీరోయిన్ అన్షు నటిగా సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడం విశేషం. ఇన్ని విశేషాలున్న మజాకా మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తోంది.

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన లేటెస్ట్ సినిమా మజాకా. ధమకా ఫేం త్రినాథ రావు నక్కిన తెరకెక్కించిన ఈ ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో రీతూ వర్మ కథానాయికగా నటించింది. అలాగే రావు రమేష్ సందీప్ కిషన్ తండ్రిగా కనిపించగా, మన్మథుడు హీరోయిన్ అన్షు మరో కీలక పాత్రలో మెరిసింది. ఫిబ్రవరి 26న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా ఆడియెన్స్ ను బాగానే నవ్వించింది. తండ్రీ కొడుకులుగా రావు రమేష్, సందీప్ కిషన్ నటన హైలెట్ గా నిలిచింది. అలాగే రీతూ వర్మ, అన్షుల అందం, అభినయం కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. ఓవరాల్ గా మజాకా సినిమాకు రూ. 20 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయని తెలుస్తోంది. థియేటర్లలో ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించిన ఈ ఎంటర్ టైనర్ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తోంది. మజాకా సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 సొంతం చేసుకుంది. ఓటీటీ డీల్ కూడా మంచి ధరకే కుదిరినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఉగాది పండగ కానుకగా మార్చి 28న ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి ఇది కేవలం రూమర్ మాత్రమే. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది.
ఏకే ఎంటర్‌టైన్మెంట్స్, హాస్య మూవీస్ పతాకాలపై రాజేశ్ దండా, అనిల్ సుంకర తెరకెక్కించిన మజాకా సినిమాలో అజయ్, మురళీ శర్మ, హైపర్ ఆది, శ్రీనివాస రెడ్డి, చమ్మక్ చంద్ర, సుప్రీత్ రెడ్డి, రఘు బాబు, గగన్ విహారి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ప్రసన్నకుమార్ బెజవాడ కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందించారు. అలాగే లియోన్ జేమ్స్ సంగీతం అందించారు. మరి థియేటర్లలో మజాకా సినిమాను మిస్ అయ్యారా? అయితే కొద్ది రోజులు ఆగండి. ఎంచెక్కా ఓటీటీలోనే చూసి కడుపుబ్బా నవ్వుకోవచ్చు.
మజాకా సినిమాలో సందీప్ కిషన్, రీతూ వర్మ..
Entha Opika Undamu ana Rojuki oka Yudham ..lol Challenge Accepted 🤘🏽
With the Blessings of Lord Shiva Promising you my Biggest Hit this #MahaShivarathiri 26th Feb ♥️
Promising you a ChartBuster Song on 10th Feb with #BabyMa 🤘🏽#Mazaka pic.twitter.com/PyMZU7mNPT
— Sundeep Kishan (@sundeepkishan) February 8, 2025
Navvula Blockbuster #Mazaka is audiences’ first choice for this weekend 😍
Excellent Evening & Night Shows for the Fun Entertainer ❤️🔥
Book Your Tickets Now! — https://t.co/hh2LCCTmC1@sundeepkishan @riturv #RaoRamesh @AnshuActress @TrinadharaoNak1 @KumarBezwada @leon_james… pic.twitter.com/q8PeVuf9na
— AK Entertainments (@AKentsOfficial) March 1, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.