AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arjun: దుబాయ్‌లోని హిందూ దేవాలయాన్ని దర్శించుకున్న అల్లు అర్జున్.. వీడియో ఇదిగో

పుష్ప 2 తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు కాస్త రిలాక్స్ అవుతున్నాడు. తన భార్య, పిల్లలతో కలిసి విదేశాల్లో చిల్ అవుతున్నాడు. తాజాగా అల్లు అర్జున్ అబుదాబిలోని ప్రఖ్యాత హిందూ దేవాలయాన్ని దర్శించుకున్నాడు.

Allu Arjun: దుబాయ్‌లోని హిందూ దేవాలయాన్ని దర్శించుకున్న అల్లు అర్జున్.. వీడియో ఇదిగో
Allu Arjun
Basha Shek
|

Updated on: Mar 23, 2025 | 12:30 PM

Share

దుబాయ్ లోని అబుదాబిలోని ప్రఖ్యాత హిందూ దేవాలయం స్వామి నారాయణ్ మందిర్ ను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సందర్శించారు. శనివారం (మార్చి 22) ఆలయానికి వెళ్లిన బన్నీ అక్కడి నిర్మాణాలను ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు అల్లు అర్జున్ కు సాదర స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం నారాయణ స్వామిని దర్శించుకున్న బన్నీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నారాయణ స్వామిని దర్శించుకున్నారు. ఆలయ ప్రతినిధులు అల్లు అర్జున్ కి ఆలయ విశిష్టతను, ప్రాముఖ్యతను వివరించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. కాగా పుష్ప 2 తో ఇండస్ట్రీ హిట్ ను సొంతం చేసుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు తన తర్వాతి సినిమా కోసం రెడీ అవుతున్నాడు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో బన్నీ తన నెక్ట్స్ సినిమాను పట్టాలెక్కించనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా అధికారికంగా ప్రారంభం కానుందని సమాచారం. దీంతో పాటు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తోనూ బన్నీ ఓ మూవీ చేయాల్సి ఉంది. పీరియాడికల్ స్టోరీ నేపథ్యంలో ఈ సినిమా రూపొందనుందని సమాచారం. త్వరలోనే ఈ రెండూ క్రేజీ ప్రాజెక్ట్స్ కు సంబంధించి అధికారిక ప్రకటనలు వెలువడనున్నట్లు తెలుస్తోంది.

దుబాయ్ లోని హిందూ దేవాలయంలో అల్లు అర్జున్.. వీడియో..

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యాలకు షాకిచ్చిన బీసీసీఐ..
సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యాలకు షాకిచ్చిన బీసీసీఐ..
పుట్టగొడుగులు చికెన్ కర్రీ.. కూరల్లో అదిరిపోయే కాంబో.. !
పుట్టగొడుగులు చికెన్ కర్రీ.. కూరల్లో అదిరిపోయే కాంబో.. !
ఈ పాటలో ఏదో మ్యాజిక్ ఉంది..ఒక్కసారి వింటే చాలు మనసు తేలికైపోతుంది
ఈ పాటలో ఏదో మ్యాజిక్ ఉంది..ఒక్కసారి వింటే చాలు మనసు తేలికైపోతుంది
బ్యాచిలర్స్‌కు వరం.. మయోన్నైస్ మ్యాజిక్ తో నోరూరించే ఎగ్ డిష్..
బ్యాచిలర్స్‌కు వరం.. మయోన్నైస్ మ్యాజిక్ తో నోరూరించే ఎగ్ డిష్..
నిర్దోషిగా తేలిన కొన్ని గంటలకే కానిస్టేబుల్ మృతి
నిర్దోషిగా తేలిన కొన్ని గంటలకే కానిస్టేబుల్ మృతి
ఏకంగా ఎమ్మల్యేపైనే క్షుద్రపూజలు.. 2 నెలలుగా అనారోగ్యంతో
ఏకంగా ఎమ్మల్యేపైనే క్షుద్రపూజలు.. 2 నెలలుగా అనారోగ్యంతో
వైభవంగా దుర్గమ్మకు వార్షికోత్సవం.. వెల్లువలా ‘సారే’ ఊరేగింపు
వైభవంగా దుర్గమ్మకు వార్షికోత్సవం.. వెల్లువలా ‘సారే’ ఊరేగింపు
యాడ్ షూట్ పై బ్రాండ్‌ స్ట్రాటజర్‌ కామెంట్స్‌..అల్లు అర్జున్ టీమ్
యాడ్ షూట్ పై బ్రాండ్‌ స్ట్రాటజర్‌ కామెంట్స్‌..అల్లు అర్జున్ టీమ్
పెళ్లయి అత్తారింటికి అక్క.. వెనకే సైకిల్ తొక్కుతూ వెళ్లిన తమ్ముడు
పెళ్లయి అత్తారింటికి అక్క.. వెనకే సైకిల్ తొక్కుతూ వెళ్లిన తమ్ముడు
ఇండియా దెబ్బ.. పాక్ అబ్బా.. తొమ్మిది నెలలైనా తేరుకోలేదుగా
ఇండియా దెబ్బ.. పాక్ అబ్బా.. తొమ్మిది నెలలైనా తేరుకోలేదుగా