అమ్మతనం గురించి సామ్.. ఏం చెప్పిందంటే.?

అమ్మతనం గురించి సామ్.. ఏం చెప్పిందంటే.? 

image

24 March 2025

Prudvi Battula 

టాలీవుడ్ హీరోయిన్ సమంత చాలా కాలం తర్వాత గత ఏడాది అడియన్స్ ముందుకు వచ్చింది. ఆమె నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ సక్సెస్ అయింది.

టాలీవుడ్ హీరోయిన్ సమంత చాలా కాలం తర్వాత గత ఏడాది అడియన్స్ ముందుకు వచ్చింది. ఆమె నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ సక్సెస్ అయింది.

వరుణ్ ధావన్ హీరోగా నటించిన ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది.

వరుణ్ ధావన్ హీరోగా నటించిన ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది.

అయితే గతంలో ఈ సిరీస్ ప్రమోషన్లలో భాగంగా బాలీవుడ్ మీడియాతో ముచ్చటించింది సామ్. సిటాడెల్ సిరీస్‎లో సమంత ఓ చిన్నారికి తల్లిగా నటించింది.

అయితే గతంలో ఈ సిరీస్ ప్రమోషన్లలో భాగంగా బాలీవుడ్ మీడియాతో ముచ్చటించింది సామ్. సిటాడెల్ సిరీస్‎లో సమంత ఓ చిన్నారికి తల్లిగా నటించింది.

దీంతో అమ్మతనం గురించి.. తల్లిగా నటించారు ఆ ఫీలింగ్ ఎలా ఉంది.. తల్లిగా ఉండడం మిస్ అవుతున్నారా ? అనే ప్రశ్నలకు సమంత సమాధానం ఇచ్చింది.

నేను తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను. ఇంకా దానికి ఆలస్యం అయిందని అనుకోవట్లేదు. అమ్మతనం అనేది ఒక అందమైన అనుభవం అని తెలిపింది.

తల్లిగా ఉండటానికి ఇష్టపడతాను. అందరూ ఏజ్ గురించి మాట్లాడతారు. కానీ తల్లి కావడానికి ఒక సమయం అంటూ ఉండదు అని చెప్పుకొచ్చింది సమంత.

దీంతో సామ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. గతంలోనూ తాను ఎప్పటికీ ఒంటరిగా ఉండేందుకు రెడీగా లేనట్లు చెప్పింది.

సిటాడెల్ వెబ్ సిరీస్ తర్వాత సామ్ మరో ప్రాజెక్ట్ ప్రకటించలేదు. కానీ ఇప్పుడిప్పుడే తిరిగి సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు సమంత సిద్ధమైనట్లుగా తెలుస్తోంది.