ఇన్‌ఫ్లుయెన్సర్ టు హీరోయిన్స్.. ఎవరా ముద్దుగుమ్మలు.?
23 March 2025
Prudvi Battula
వీరిలో ముందుగా చెప్పుకోదగ్గ ఇన్‌ఫ్లుయెన్సర్ ఇమాన్వి హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ సినిమాతోనే జతకట్టేస్తుంది.
రీసెంట్ బ్లాక్ బస్టర్ కోర్ట్ మూవీ హీరోయిన్ శ్రీదేవి అపల్లా కూడా ఇన్‌ఫ్లుయెన్సర్. ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేస్తూ కథానాయిక ఛాన్స్ కొట్టేసింది.
టిక్‌టాక్‌లో ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మొదలై టెలివిజన్‌లో సందడి చేసిన దీపికా పిల్లి యాంకర్ ప్రదీప్ సరసన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయితో కథానాయకిగా పరిచయం కానుంది.
యూట్యూబ్‌లో వెబ్ సిరీస్‌లతో పేరు తెచ్చుకున్న వైష్ణవి చైతన్య తన తొలి చిత్రం బేబీ ద్వారా ఇంతకు ముందెన్నడూ లేని స్టార్‌డమ్‌ను పొందింది.
వీరికి ముందు చాందిని చౌదరి కూడా యూట్యూబర్‌గా షార్ట్ఫిల్మ్స్లో నటిస్తూ.. మను మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.
టిక్‌టాక్, డబ్‌స్మాష్ వీడియోలతో వైరల్ అయినా మృణాళిని రవి సాఫ్ట్‌వేర్ జాబ్ వదిలి గద్దలకొండ గణేష్ మూవీతో హీరోయిన్ అయింది.
పూజిత పొన్నాడ టీసిఎస్లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా చేస్తూ షార్ట్ ఫిల్మ్‌లో నటించింది. ఆలా దర్శకుడు సినిమాతో వెండితెరపై తొలిసారి కనిపించింది.
యూట్యూబ్ స్టార్ బిగ్ బాస్ తెలుగు కంటెస్టెంట్ అలేఖ్య హారిక బేబీ ఫేమ్ సాయి రాజేష్ దర్శకత్వంలో సంగీత్ శోబన్ పక్కన కథానాయకిగా అరంగేట్రం చేయనుంది.