ఆ స్టార్ హీరోలు మహేష్‌కి క్లాస్ మేట్స్ అని తెలుసా.?
22 March 2025
Prudvi Battula
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఓ పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు.
ఈ క్రేజీ ప్రాజెక్టు కోసం జుట్టు, గడ్డం భారీగా పెంచేశాడు మహేష్ బాబు. అలాగే నిత్యం జిమ్ లో వర్కవుట్స్ చేస్తూ బాడీ మెయింటైన్ చేస్తున్నాడు.
కాగా చాలా మంది టాలీవుడ్ హీరోల్లాగే సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా చిన్నప్పుడు చెన్నైలోనే పుట్టి పెరిగాడు.
ఈ నేపథ్యంలోనే మహేష్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలిశాయి. అదేంటంటే.. కోలీవుడ్ లో ఇద్దరు టాప్ స్టార్స్ మహేష్ క్లాస్ మేట్స్ అట.
వారెవరో కాదు.. దళపతి విజయ్, సూర్య తమ్ముడు కార్తీ. వీరిద్దరూ చిన్నప్పుడు మహేష్ బాబుతోనే కలిసి చదువుకున్నారట.
సినిమా పరిశ్రమకు చెందిన కుటుంబాలు కావడంతో మహేష్, విజయ్, కార్తీ ముగ్గురు ఒకే విద్యాసంస్థలో చదువుకున్నారట.
కాగా మహేష్ బాబు సినిమా కెరీర్లో బిగ్గెస్ట్ హిట్స్ ఒక్కడు, పోకిరి చిత్రాలను దళపతి విజయ్ రీమేక్ చేసి హిట్స్ కొట్టాడు.
దీంతో ఈ ఇద్దరి స్టార్ హీరోల మధ్య మంచి స్నేహం ఉంది. అలాగే హీరో కార్తీతోనూ మహేష్ బాబుకు మంచి అనుబంధం ఉంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
త్రిష ఫెవరెట్ హీరోయిన్ ఎవరంటే.?
ఇన్స్టాగ్రామ్ ద్వారా సితార అంత సంపాదిస్తుందా.?
సబ్వే సర్ఫర్స్ గేమ్ వెనుక ఓ విషాద గాథ ఉందని మీకు తెలుసా.?